– తులసివనంలో గంజాయి.. కాంగ్రెస్ పార్టీకి అక్షరాల వర్తిస్తుంది
– పార్లమెంట్ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఆగ్రహం
హైదరాబాద్: సిపిఐ జాతీయ మహాసభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా పై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. జాతీయ పార్టీ హోదా కోల్పోయి మనుగడ సాగిస్తున్న సిపిఐ జాతీయ మహాసభల్లో.. అస్తిత్వానికి సవాల్ గా మారుతున్న తరుణంలో వారి సభల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ కూడా అతి త్వరలో అదే పరిస్థితి రానున్నది.
నేడు కాంగ్రెస్ పార్టీది అస్తిత్వ సవాల్ లాంటిది. అధికారం మాట అటు నుంచి మనుగడ సాగించడానికి ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి.. తప్పుడు మాటలతో కుట్ర కుతంత్రాలతో అబద్ధాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డికి, రానున్న పరిస్థితుల్లో అర్థమై ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడుతూ చులకన అవుతున్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతున్న విధానం, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విధానం దేశ ప్రజలలో వారికి రోజురోజుకు పతనమవుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..రేవంత్ రెడ్డి మాట్లాడిన తులసివనంలో గంజాయి అనే పదం కాంగ్రెస్ పార్టీకి అక్షరాల వర్తిస్తుంది.
ఇకనైనా మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి పై గౌరవంతో భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న విషయాన్ని గ్రహించుకొని ప్రజల అసహ్యించుకునే విధంగా కాకుండా ఉన్న కాస్త కోల్పోకుండా చూసుకోవాలి. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తున్నదనే విషయాన్ని ప్రపంచం గుర్తించింది. ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ నరేంద్ర మోడీ ని ప్రధానమంత్రిగా ఉన్నందుకు గర్విస్తూ భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచం మొత్తం చాటుతున్నారు.
భారతదేశ ప్రజల కలలుగన్న నవ భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్ర దేశంగా రూపొందుతుంది అన్న భావన లో సంకోచం లేదు. జరిగి తీరుతుంది అన్న వాస్తవాన్ని భారతదేశ ప్రజలు గుర్తిస్తున్నారు.