Suryaa.co.in

Telangana

మానుకోట నుండే రేవంత్ రెడ్డికి పతనం

– మాజీ మంత్రి , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ లు తక్కళ్లపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీ మాలోత్ కవిత

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తేనే మహబూబాబాద్ లో మహా ధర్నా కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మహా ధర్నాకు అనుమతి ఇచ్చిన న్యాయ స్థానానికి ధన్యవాదాలు. మహాధర్నాకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాగాన్ని పట్టుకొని పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు. రేవంత్ రెడ్డి ఏమో అదే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు.

లగచర్ల గిరిజన రైతులు ఎదురు తిరగడం చూసి రేవంత్ రెడ్డి ఖంగు తిన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఇంత తిరుగుబాటు అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. లగచర్ల రైతులనే మెప్పించని రేవంత్ రెడ్డి ,రాష్ట్రాన్ని ఎం మెప్పిస్తారు ? కనీసం ఊరు దాటని గిరిజన మహిళలు, ఢిల్లీ వరకు వెళ్లి పిర్యాదు చేశారు ..

ఇకనైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి. లగ చర్ల లో ఫార్మా విలేజ్ ను రద్దు చేసుకోవాలి. మానుకోట తో ఎవరు పెట్టుకున్న వారికి ముడుతుంది గతంలో కాంగ్రెస్ మూడింది. ఇప్పుడు మానుకోట నుండే రేవంత్ రెడ్డి కి పతనం స్టార్ట్ అయ్యింది..

25న మహబూబాబాద్ లో గిరిజన, దళిత రైతులతో మహా ధర్నా చేపడతాం. ధర్నా తో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం. గతంలో మేము కూడా భూములు తీసుకున్నాం మెడికల్ కాలేజీ కోసం. అవి ప్రభుత్వ భూములు అయిన కూడా, గిరిజన బిడ్డలకు నష్టపరిహారం ఇచ్చాము కంపెనీ లకు మీ కుటుంబ స భ్యుల కంపెనీ ల కోసం భూములు లా క్కుంటున్నడు రేవంత్ రెడ్డి.

గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీ ల కోసం భూమి సేకరించారు.పర్యావరణ సమస్య రాకుండా ఉండేతందుకు. ఫార్మా కు కేటాయించిన భూములు ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టుకున్న బి ఆర్ ఎస్ నాయుకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కట్టించిన భవన్ లను వదిలేసి తన ఇంటి కాడా ఇనుపకంచెలు వేసుకొని ఉన్నావు. ప్రజా భవన్ లో నువ్వు ఎంత మందికి అందుబాటులో ఉన్నావు?

నీ అరెస్ట్ ల కి భయపడేది లేదు రేవంత్ రెడ్డి. ప్రజలకు బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుంది. హై కోర్ట్ కి ధన్యవాదాలు .ధర్నాకు అనుమతి ఇచ్చినందుకు, ప్రభుత్వాన్నికి కోర్ట్ తీర్పు చెంపపెట్టు లాంటిది. పచ్చని పంట పొలాలు తీసుకోవలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేద గిరిజనలు పైన చేస్తున్న దాడు లుకు నిరసనగా మహబూబ్ బాద్ లో ధర్నా నిర్వహిస్తాం. పోలీసులు ధర్నాకు అనుమతి ఇస్తాం అని చెప్తే అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరవాత అనుమతి ఇవ్వలేదు. సీఎం ఆఫీస్ నుంచి అనుమతి లేదు అన్నారు పోలీస్ వ్యహరించిన తీరు దారణంగా ఉంది.

మహబూబ్ బాద్ లో ఏమి జరిగింది పోలీస్ లతో కవాతు నిర్వహించారు 144 సెక్షన్ ఎందుకు పెట్టారు? ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.రైతుల గిరిజనల కోసం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.మా ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డం పడుతోంది. లగచర్లలో గిరిజనులపైన దౌర్జన్య కాండకు నిరసనగా ధర్నా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.

పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కేటీఆర్ మహబూబ్ బాద్ కి వచ్చేది గిరిజనులకు అండగా ఉండేందుకే. న్యాయస్థానం మాకు ధర్నాకు అనుమతి ఇచ్చింది. అన్ని గిరిజన సంఘాలు నాయకుల విజ్జప్తి మేరకు కేటీఆర్ వస్తున్నారు

LEAVE A RESPONSE