– కే ఎల్ ఎస్ ఆర్ కంపెనీ దివాళా తీసింది
– దివాళా కంపెనీ కి ఇన్ని వేల కోట్ల కాంట్రాక్టులా ?
– కాంట్రాక్టులు , కమీషన్ల గురించి ఆలోచించే రేవంత్ రెడ్డికి, గ్రామీణ దేవతల గురించి ఎలా తెలుస్తుంది ?
– హిల్ట్ పి పాలసి పై దమ్ముంటే సిబిఐ విచారణ చేయాలి
– భూముల కుంభకోణంపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు?
– రేవంత్ రెడ్డిని కాపాడతారా లేక విచారణ చేస్తారా బీజేపీ చెప్పాలి
– బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కే ఎల్ ఎస్ ఆర్ మీద హై కోర్టు సిబిఐ విచారణ కు ఆదేశించింది. ఇదే కంపెనీ గతం లో రేవంత్ రెడ్డి కి విలువైన కారు బహుమానం గా ఇచ్చింది. త్వరలోనే రేవంత్ రెడ్డి సీఎం గా రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. రెండేళ్లలో కే ఎల్ ఎస్ ఆర్ కంపెనీ కి రేవంత్ రెడ్డి ఆరు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చారు. కే ఎల్ ఎస్ ఆర్ కంపెనీ దివాళా తీసింది .దివాళా కంపెనీ కి ఇన్ని వేల కోట్ల కాంట్రాక్టులా ? ఇండియన్ బ్యాంక్ కూడా కే ఎల్ ఎస్ ఆర్ కు నోటీసులు ఇచ్చింది.
రెండు రోజుల క్రితం హైకోర్టు కే ఎల్ ఎస్ ఆర్ అవకతవకలపై విచారణ జరపాలని సిబిఐ కి సూచించింది. తాజాగా ఎన్ సి ఎల్ ఈ టీ కోర్టు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్, కే ఎల్ ఎస్ ఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలను నిలిపి వేయాలని ఆదేశించింది. హైకోర్టు ,ఎన్ సి ఎల్ ఈ టీ కోర్టు ఆదేశాలు ఇంత స్పష్టంగా ఇచ్చినా, కే ఎల్ ఎస్ ఆర్ కంపెనీ మీద ఎందుకంత ప్రేమ ? కోర్టుల ఆదేశాల నేపథ్యం లో కే ఎల్ ఎస్ ఆర్ కంపెనీ కి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులు రద్దు చేయాలని బీ ఆర్ ఎస్ డిమాండ్ చేస్తోంది.
ఇలాంటి స్కాం లను డైవర్ట్ చేయడానికి సీఎం , మంత్రులు అనవసర అంశాలు తెర పైకి తెస్తున్నారు. తెలంగాణ గ్రామీణ దేవతలను కూడా రేవంత్ అవమానించారు. కాంట్రాక్టులు , కమిషన్ల గురించి ఆలోచించే రేవంత్ రెడ్డికి, గ్రామీణ దేవతల గురించి ఎలా తెలుస్తుంది ? హిల్ట్ పి పాలసి పై దమ్ముంటే సిబిఐ విచారణ చేయాలి. మెస్సీ తో సీఎం రేవంత్ ఫుట్ బాల్ ఆడటం ప్రైవేటు వ్యవహారం ..అదే ప్రధానం అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసి పది రోజులు అవుతోంది.
మా జగదీశ్ రెడ్డి మరుసటి రొజే స్పందిస్తే, మంత్రులు ఇపుడు క్యూ కట్టి మాట్లాడటం డై వెర్షన్ రాజకీయంలో భాగమే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై ఎఫ్.ఐ.ఆర్ అయితే, దాన్ని కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. ఇస్తావా చస్తావా అన్న రేవంత్ రెడ్డి మోడీ దగ్గరకు వెళ్లి చేతులు కట్టుకున్నారు. బీజేపీ ఎందుకు రేవంత్‌రెడ్డిని కాపాడుతోంది? బీజేపీ ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం అయింది. భూముల కుంభకోణంపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? ఆరు వేల కోట్ల కాంట్రాక్టుపై సీబీఐ విచారణ జరపాలి. .రేవంత్ రెడ్డిని కాపాడతారా లేక విచారణ చేస్తారా బీజేపీ చెప్పాలి