– ధాన్యం టెండర్లలో కుంభకోణం జరుగుతుందని బిఆర్ఎస్ చెప్పింది
– రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని క్యాబినెట్ తేల్చింది
– డబ్బులు జప్తు చేయాలని జీఓ నంబర్ 15 విడుదల చేసింది
– టెండర్ విలువ కంటే 230 రూపాయలు ఎక్కువ వసూలు చేశారు
– మొత్తం డబ్బులు జప్తు చేయకుండా కేవలం 66 కోట్లు మాత్రమే ఎట్లా చేస్తారు?
– కాంగ్రెస్ పార్టీలో రోషం ఉన్నవాళ్లు ఎక్కడా మాట్లాడటం లేదు
– ధాన్యం టెండర్ల కుంభకోణంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?
– మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్: ధాన్యం టెండర్లలో కుంభకోణం జరుగుతుందని బిఆర్ఎస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని క్యాబినెట్ తేల్చింది. డబ్బులు జప్తు చేయాలని జీఓ నంబర్ 15 విడుదల చేసింది.
ధాన్యం టెండర్ల కుంభకోణంపై డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు చేపట్టలేదు? 66 కోట్ల రూపాయలను జప్తు చేయాలని క్యాబినెట్ ఎందుకు తీర్మానం చేసిందో చెప్పాలి. ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకు క్యాబినెట్ కు ఫైల్ వెళ్ళింది. టెండర్ విలువ కంటే 230 రూపాయలు ఎక్కువ వసూలు చేశారు.
ధాన్యం కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీలో రోషం ఉన్నవాళ్లు ఎక్కడా మాట్లాడటం లేదు. ధాన్యం టెండర్ల కుంభకోణంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? 380 కోట్లకు 66 కోట్లు మాత్రమే జప్తు చేశారు. తప్పించుకోవడం కోసమే 66 కోట్లు జప్తు చేశారు. టెండర్లు నలుగురు వేస్తే ఇద్దరికి మాత్రమే ఎందుకు పెనాల్టీ వేశారు.
మొత్తం డబ్బులు జప్తు చేయకుండా కేవలం 66 కోట్లు మాత్రమే ఎట్లా చేస్తారు? డబ్బు మొత్తం రేవంత్ రెడ్డి కక్కాల్సిందే. మొత్తం వ్యవహారంపై
జ్యుడీషియరీ విచారణ జరపాలి. ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ , కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సతీష్ రెడ్డి ,పల్లె రవికుమార్ ,బీ ఆర్ ఎస్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.