– రెండు రైల్వే లైన్లపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి
– హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అనేది విభజన చట్టంలో ఉంది
– మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్
హైదరాబాద్: రైల్వే ప్రాజెక్టుల పై సీఎం రేవంత్ రెడ్డి నిన్న రివ్యూ చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అనేది ఏపీ విభజన చట్టంలో ఉంది. రెండు ప్రధాన రైల్వే లైన్లను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారు
ఆదిలాబాద్ కు రైలులో వెళ్ళాలంటే మహారాష్ట్రకు వెళ్ళి మళ్లీ ఆదిలాబాద్ కు వెళ్ళాలి. నిజాం కాలం నాటి రైల్వే లైన్ ఇప్పటికీ ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు సర్వే,డీపీఆర్ రెడీ చేయించాము. ఆదిలాబాద్,నిర్మల్,ఆర్మూర్ కు వచ్చే విధంగా ప్రతిపాదన చేశాము.
కరీంనగర్ వయా హుజురాబాద్ టూ కాజీపేటకు రైల్వే లైన్ పై చర్చించలేదు. ఈ రైల్వే లైన్ లో కొత్త లింకులు కలిపితే ఉత్తర తెలంగాణ పది జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ వస్తుంది. రెండు రైల్వే లైన్లపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ ,బీజేపీ ఎంపీలు శ్రద్ధ పెట్టి రైల్వే లైన్ పూర్తిచేయాలి.
తెలంగాణ సమస్యను తెలంగాణ కళ్ళతో చూడాలి. రెండు రైల్వే లైన్లు ఏర్పాటు చేసే విధంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డికి,చీఫ్ సెక్రటరీకి,దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాస్తున్నా.
ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావు ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,గాదరి బాలమల్లు ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.