Suryaa.co.in

Telangana

తలసాని శ్రీనివాస్ యాదవ్ తో రేవంత్ కు పోలిక ఎక్కడిది?

-రేవంత్ లాగా శ్రీనివాస్ యాదవ్ కు నేర చరిత్ర ఉందా?
-జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ మా జాతులను విమర్శించడమా?
-రేవంత్ రెడ్డి గొల్ల కురుమ లకు క్షమాపణ చెప్పాలి
-క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు
-రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మెయిలర్
-ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం

గొల్ల,కురుమ కులవృత్తులను అవమానిస్తూ, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను హేళన చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తక్షణం తమ కులాలకు క్షమాపణ చెప్పాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం డిమాండ్ చేశారు. కాయకష్టం చేసుకునే తాము రేవంత్‌రెడ్డి మాదిరిగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడమని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఏమన్నారంటే..
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నుద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. గొల్ల కురుమ జాతులను రేవంత్ రెడ్డి అవమానపరిచారు. మేము మా భాధను విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. మా జాతులు నీతి నిజాయతీగా బతుకుతాయి.అందరి తలలో నాలుకలా ఉండే జాతులు మావి. రేవంత్ రెడ్డి గతం లో కూడా కుల దురహంకారం తో మాట్లాడారు. తమకే పాలన తెలుసు అన్నట్టుగా రేవంత్ రెడ్డి తన కులం ఆత్మీయ సమ్మేళనం లో మాట్లాడినప్పుడు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తన నీచ రాజకీయాల గురించి కులాల ను కించపరచడం తగదు.

రేవంత్ లాగా శ్రీనివాస్ యాదవ్ కు నేర చరిత్ర ఉందా? ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ చేయూత నందిస్తే రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడు. జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ మా జాతులను విమర్శించడమా? రేవంత్ రెడ్డి గొల్ల కురుమ లకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలి. బ్లాక్ మెయిలింగ్ పద్ధతులు రేవంత్ మానుకోవాలి. పీసీసీ అధ్యక్ష పదవి ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాడని రేవంత్ సొంత పార్టీ లోని వారే అంటున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం ఏమన్నారంటే..
రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మెయిలర్. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం రేవంత్ ప్రవృత్తి. శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో సీనియర్ అని చూడకుండా రేవంత్ కులం పేరుతో దూషించారు. రేవంత్ తక్షణమే గొల్ల కురుమ లకు క్షమాపణ చెప్పాలి. శ్రీనివాస్ యాదవ్ తో రేవంత్ కు పోలిక ఎక్కడిది? గొల్ల కురుమ లకు సీఎం కేసీఆర్ ఎంతో చేశారు. రేవంత్ కు సంస్కారం లేదు. రేవంత్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా గొల్ల కురుమలు కంకణం కట్టుకుని ఆయన్ను ఓడిస్తారు.ముందు తన పార్టీ నేతల విమర్శల పై రేవంత్ సమాధానం చెప్పాలి.. శ్రీనివాస యాదవ్ పై విమర్శలు చేయడం కాదు. రేవంత్ తన దురహంకారానికి మూల్యం చెల్లించుకోక తప్పదు.

LEAVE A RESPONSE