– నియంత పోకడలు.. నికృష్టపు మాటలు
– పులివెందుల టీడీపీ నేతలే కొడంగల్ లో ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్లు
– చంద్రబాబును రేవంత్ రెడ్డి అడుక్కుంటున్నారు
– రేవంత్ కు మానసిక రుగ్మత
– బీసీలకు రెవిన్యూ శాఖ ఇవ్వండి
– మాజీమంత్రి వి .శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభలో రాజకీయ విమర్శలా? ఎన్నిసార్లు మందలించినా రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవడం లేదు. అందివచ్చిన అవకాశంలో రేవంత్ రెడ్డి ఓ రాజకీయ లక్కీభాస్కర్. వెళ్లిన ప్రతిచోటా పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు.
ఆయన మాటలను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఖండించారు
కొల్లాపూర్ లో నిర్వహించిన సభలో 40 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 38 సార్లు కేసీఆర్ నామస్మరణ చేశారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేవంత్ రెడ్డి పాలమూరుకు ఏం చేశాడు ? కేసీఆర్ నామస్మరణతో రేవంత్ తన పాపం ప్రక్షాళన చేసుకుంటున్నాడని భావిస్తున్నాం
అడుగడుగునా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుని, ఇక్కడున్న బిడ్డల బలిదానాలకు కారణం అయిన చంద్రబాబు నాయుడును వేడుకుంటున్న రేవంత్ రెడ్డి, తెలంగాణ సాధించిన కేసీఆర్ ని విషం చావమంటావా ? ఆరు నెలల క్రితం శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా స్కూల్ కు ఇంతవరకు దిక్కు లేదు .. మళ్లీ మరో పాఠశాలకు శంకుస్థాపన చేశారు. కొత్తగా పాలమూరుకు చేసింది ఏమిటి ?
ఆది నుండి తెలంగాణకు ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీ .. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను నిర్మించాల్సిన స్థలాలను మార్చారు.
మా నాన్న చనిపోతే దినాలకు నీళ్లు లేని దిక్కుమాలిన పాలన కాంగ్రెస్ పార్టీది అని రేవంత్ రెడ్డి స్వయంగా శాసనసభలో చెప్పాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది కాంగ్రెస్ పాలనలోనే. జూరాల నిర్మాణానికి నాలుగు దశాబ్దాల సమయం తీసుకున్నారు. 87,500 ఎకరాలు పారే ఆర్డీఎస్ కెనాల్ ను 8 వేల ఎకరాలకు పరిమితం చేశారు.
పాలమూరుకు ఎత్తిపోతలే శరణ్యం అని కల్వకుర్తి ఎత్తిపోతలకు 1984 జూన్ 16న ఎన్టీఆర్ ఆదేశాలు ఇస్తే 1997 డిసెంబరులో సర్వే కోసం 50 లక్షలు ఇచ్చారు. 2014 వరకు పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు. జలయజ్భంలో మొదలుపెట్టినా పనులు ముందుకు సాగనియ్యలేదు .. కేసీఆర్ దీనికి 40 టీఎంసీల నీళ్లు కేటాయిస్తే చంద్రబాబు అడ్డుపుల్ల వేశాడు. దీని కింద ఉన్న రిజర్వాయర్ల సామర్ధం కేవలం నాలుగు టీఎంసీలే.
కాంగ్రెస్, టీడీపీ హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు తీసుకున్న సమయం మూడు దశాబ్దాలు. పెట్టిన ఖర్చు రూ.2700 కోట్లు మాత్రమే. రూ.3400 కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ ని ఏం చేశాడు పాలమూరుకు అని ప్రశ్నిస్తావా ?
పాలమూరులో ప్రస్తుతం కనిపిస్తున్న నీళ్లు కేసీఆర్ తీసుకువచ్చినవే … నిన్న రేవంత్ రెడ్డి ప్రయాణించిన రహదారి కూడా కేసీఆర్ నిర్మించినదే .. నీకు తెలియకుంటే నీ పక్కన ఉన్న మంత్రికి అయినా సిగ్గుండాలి
పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడానికి రేవంత్ ను సమర్ధించే నీ గురువు చంద్రబాబు నాయుడు, ఆంధ్రామీడియా, ఆంధ్రా రాజకీయ నేతల కుట్రలను అడ్డుకుని రాష్ట్ర నిధులతో రూ.32 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేసింది కేసీఆర్.
పాలమూరు వ్యక్తి సీఎం అయితే హర్షించడం లేదు అంటున్నారు .. కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి విధేయులుగా ఉండడం మాకు గర్వకారణం. రేవంత్ రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీలో మోడీకి ఊడిగం చేసే స్థితి మాకు లేదు. రాహుల్ గాంధీ పేరుతో ముఖ్యమంత్రి అయ్యి చివరికి మోడీ భక్తుడు అయినందుకు ఈ రోజు రాహుల్ గాంధీ మీకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. మీ విశ్వాసఘాతుకం గ్రహించే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు
పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రయత్నం అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలలలో ఎందుకు చేయలేదు ? కేసీఆర్ లేకుంటే రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు ? పాలమూరును ఐదు జిల్లాలు చేసిందే కేసీఆర్ . మెడికల్ కళాశాల తేవడం అనేది ఒక కల. ఒక్క పాలమూరు జిల్లాకే కేసీఆర్ ఐదు మెడికల్ కళాశాలలు తీసుకువచ్చారు.
కేసీఆర్ తెచ్చిన మెడికల్ కళాశాలను కొడంగల్ కు తరలించింది వాస్తవం కాదా ? కేసీఆర్ ఏం చేశాడు అనడానికి సిగ్గనిపించడం లేదా ? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క మెడికల్ కళాశాల అయినా ఢిల్లీకి వెళ్లి తెచ్చాడా ?
కేసీఆర్ కట్టిన సచివాలయంలో ఉంటూ పాలన చేస్తూ, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ లో కులుకుతూ కేసీఆర్ ని విమర్శించడం చూస్తే రేవంత్ కు మానసిక రుగ్మత ఉన్నట్లు అనిపిస్తుంది
చంద్రబాబుకు చెందిన పులివెందుల మనుషులు ఈ రోజు కొడంగల్ లో చేస్తున్న ప్రభుత్వ పనులకు గుత్తేదారులు .. కావాలంటే ఎవరయినా పరిశీలించుకోవచ్చు గురుదక్షిణ కింద రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతాం అంటే చూస్తూ ఊరుకోం. కేసీఆర్ ని తూలనాడుతాం అంటే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మేము ఎంతో సహనంగా ఉన్నాం. పెట్రేగి పోతే, వేధింపులు ఎక్కువైతే మేము కూడా స్పందించాల్సి వస్తుంది .. ప్రజా తిరుగుబాటు తప్పదు
కేసీఆర్ కన్నా గొప్పగా ఏం చేస్తారో చేయండి ? 20 నెలలలో ఏం చేశారని కేసీఆర్ మీ పనులు కుమిలిపోతారు ? రూ.317 కోట్లతో ఈ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారా ? ఒక్కసారి రైతుభరోసా ఇచ్చి మూడు సార్లు ఎగ్గొట్టినందుకా ? రుణమాఫీ సగం చేసినందుకా ?
రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు చరిత్రలో చాలా మంది ఉన్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీని మోస్తున్నట్లు భావించవద్దు. తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదు. ప్రాణాలొడ్డి ప్రజలకోసం నిలబడిన వాళ్లు కమ్యూనిస్టులు. ప్రజల మీద దౌర్జన్యాలు చేసింది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్. రేవంత్ కు తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేదు. అంతా అయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి సీఎం స్థానంలో కూర్చున్నాడు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కెఎల్ఐ పనులు ఎలా జరిగాయి ? బీఆర్ఎస్ హయాంలో ఎలా జరిగాయో ఒక్కసారి లెక్కలు తీసుకుని చూసుకుంటే ఎవరేం చేశారో తెలుస్తుంది
రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేకంటే ముందే మేము పాలమూరు నుండి మంత్రులం అయ్యాం. ఆ జిల్లా కోసం పనిచేసి ఫలితాలు తీసుకువచ్చాం. యంగ్ ఇండియా పాఠశాలల వ్యవహారం తర్వాత ఉన్న ఇప్పటి వరకు ఉన్న పాఠశాలల బిల్లులు, మధ్యాహ్న భోజనం బిల్లులు ఇవ్వండి
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను చావాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబును రేవంత్ రెడ్డి అడుక్కుంటున్నారు. బి ఆర్ ఎస్ హయాంలో ఏమీ చేయనిదే ప్రాజెక్టులు పూర్తి అయ్యాయా? తన శాఖలో డబ్బులు లేవని వాకిటి శ్రీహరి అంటున్నారు. బీసీలకు రెవిన్యూ శాఖ ఇవ్వండి. బట్టలు ఉతికే వాళ్లకు,చాపలు పట్టే వాళ్లకి మంత్రి పదవులు ఇచ్చామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నారు. మిగతా బీసీ కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలి కదా?
నల్లమల పులి పులిలాగా కొట్లాడాలి. నల్లమల పులి చంద్రబాబును ప్లీజ్ అని ఆడుక్కోవడం ఎందుకు? బనకచర్లపై చర్చ రాలేదని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారు. ఏపీ మంత్రి బనకచర్లపై చర్చ జరిగింది కట్టి తీరుతామని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలపై స్వంత ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో స్వంత ఎమ్మెల్యేలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.
రెఫరెండంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టండి. సీఎం కొల్లాపూర్ పర్యటనతో ఒక్క రూపాయి లాభంలేదు. అందరికి ఇచ్చినట్లే కొల్లాపూర్ కు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు.కొల్లాపూర్ కు నిధులు సాధించడంలో జూపల్లి విఫలం అయ్యారు.ఐదుగురు సీఎంల వద్ద మంత్రిగా చేసిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ కు ఏం చేశారు?
గతంలో కాంగ్రెస్ వుండి టీడీపీ,బిఆర్ఎస్ పార్టీలనుతిట్టారు. కేసీఆర్ లేకపోతే పాలమూరు జిల్లా ఆగం అయ్యేదని జూపల్లి అన్నారు. తన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం జూపల్లి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు.
ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ నేతలు అభిలాష్ రంగినేని, కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.