రేవంత్ రెడ్డి బొగ్గును ఆంధ్ర, కర్ణాటక కు అమ్ముకుంటున్నాడు

- 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్
- తెలంగాణలో మళ్లీ విద్యుత్ సమస్య
- రైతాంగానికి 2014 పూర్వపు కరెంట్ కష్టాలు
- ఇళ్లకు పవర్ కట్స్,పరిశ్రమలకు జనరేటర్లు వాడే పరిస్థితి
- కేసీఆర్,కేటీఆర్ పిలుపు మేరకు విద్యుత్ ప్లాంట్ల సందర్శన
- మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల పవర్ ప్లాంట్‌ను పరిశీలించాం
- దామరచర్ల 4000 మెగావాట్ల ప్లాంట్ దేశంలోనే అతిపెద్దది
- యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత
- యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
నల్లగొండ జిల్లా: విద్యుత్ కోతలపై ప్రభుత్వం చెబుతున్న కారణాలన్నీ పచ్చి అబద్ధాలు. బొగ్గును ఆంద్రకు కర్ణాటక కు అమ్ముకుంటున్నాడు రేవంత్ రెడ్డి. .40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగింది. ఇక్కడి రైతులకు మాత్రం 6 గంటలు కూడా ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి బండారం బయటపడింది.
ఈ ప్రభుత్వం లో అడుగడుగునా అక్రమాలు, స్కామ్ లే. ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్లాంట్ లోపల అధికారులు నెత్తి నోరు కొట్టుకున్నారు. ప్రభుత్వం కావాలని ప్లాంట్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు అని వాపోతున్నారు. ప్లాంట్ మొత్తాన్ని ఫెయిల్యూర్ చేసే పెద్ద కుట్ర చేస్తున్నారు.
బొగ్గు కొరత లేనే లేదు. మన బొగ్గును ఇతర రాష్ట్రాల కు ఆముకుంటున్నారు. 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారు. అన్ని కక్కిస్తాం. అన్నిటినీ వెలికితీస్తాం. రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న స్కామ్ లు అన్ని ఒక్కొక్కటిగా బయటకి తీస్తారు.
తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉండేది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఉత్పత్తిని 21,500 మెగావాట్లకు పెంచాం. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం, దురుద్దేశంతో విద్యుత్ ఉత్పత్తి ఆపేసింది.
