– రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు తీసుకెళ్లడానికి వెళ్తున్నారు
– అసెంబ్లీ మీడియా పాయింట్ లో బి ఆర్ ఎస్ అసెంబ్లీ విప్ కె .పి .వివేకానంద, ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల ఎమ్మెల్యేలు గ్రామాల్లో ముఖం చూపెట్టుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు విశ్వాసం కోల్పోయారు. అత్యంత విఫల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 99 రోజులు ప్రజాపాలన 9 రోజులుకే బొక్క బోర్లా పడింది. 99 రోజులు పాలనకు నిధులు లేవు. విధులు లేవు.
ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం తీసుకున్న అట్టర్ ఫ్లాప్. కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కాలం అయింది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు తీసుకెళ్లడానికి వెళ్తున్నారు.ముఖ్యమంత్రి పై విశ్వాసం కోల్పోయిన ఎమ్మెల్యేలు తమ దారి తాము చేసుకుంటున్నారు.
రైతుకు ప్రకృతి వైపరీత్యాలే సమస్య అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వ వైపరీత్యాలు కూడా తోడయ్యాయి.యాసంగి కి రైతు భరోసా ఇవ్వలేదు. మొక్క జొన్న కొనుగోలు కు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు లేవు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రావాల్సిన ధరలో 35 శాతం నష్టపోతున్నారు. కరెంటు లేదు. పెట్టుబడి లేదు. రైతు చాలా నష్టపోతున్నారు. ప్రెసెంట్ ని నాశనం పట్టించి ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి కళ్ళు తెరవాలి