-అప్పుడే కేసీఆర్‌ను ఓడించాలని పీకేనే పిలుపిస్తారు
-ఆయనొచ్చింది టీఆర్‌ఎస్‌తో తెగదెంపుల కోసమే
-టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
సీఎం కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ సారథి ప్రశాంత్ కిశోర్(పీకే) భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. తెరాసతో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్‌ను కలిశారని చెప్పారు. ఇక ప్రశాంత్ కిశోర్‌తో తెరాసకు, ఐ ప్యాక్‌కు పీకేకు ఎలాంటి సంబంధం ఉండదని రేవంత్ అన్నారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి తనతో ఉమ్మడి ప్రెస్‌మీట్ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్ చెప్పారు. ఆ రోజు పీకే స్వయంగా తెరాసను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం వింటారన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్ఠానం మాటే ఫైనల్ అని రేవంత్ రెడ్డి తెలిపారు.