Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ ది ఆత్మీయత … కాంగ్రెస్ ది అహంకారం

-ఇది అహంకారానికి ఆత్మీయతకు మధ్య జరుగుతున్న ఎన్నిక
-రేవంత్ రెడ్డి చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బోధన్ : బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు స్పష్టం చేశారు. అహంకారానికి ఆత్మీయతకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని అన్నారు. ఎవరు కావాలన్నది ఆలోచన చేసి ప్రజలు నిర్ణయించాలని కోరారు. చెప్పులు విడిచి ఇంట్లోకి రండి అనే వ్యక్తులు కాంగ్రెస్ నాయకులని ధ్వజమెత్తారు. రైతులకు రైతు బంధు ఇస్తుంటే రైతులకు బిచ్చం వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్తు ఎందుకని… 3 గంటల విద్యుత్తు చాలదా అని కూడా రేవంత్ రెడ్డి అహంకారంతో అన్నారని ఎండగట్టారు. విద్యార్థి నాయకులను అడ్డమీది కూలీలని రేవంత్ రెడ్డి దూషించారని, ఎంత అహంకారం ఉంటే ఇన్ని మాటలు అంటారని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE