– హైదరాబాద్ ను అన్నదమ్ములకు పంచి ఇచ్చారు
– మద్యం,ఇసుక,ఫ్లై యాష్ లో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీ
– రేవంత్ రెడ్డి స్వంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో ఓడిపోయారు
-శాంతిభద్రతలు విఫలం
– మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ , కోరుకంటి చందర్ , కార్పొరేషన్ మాజీ చైర్మన్ సి .రాకేష్ కుమార్
రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. రేవంత్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ పైన విద్వేషంతో వ్యవహరిస్తోంది. విద్యా శాఖలో గందరగోళమైన పరిస్థితి ఉంది. కేసీఆర్ ఫోటోలు పాఠ్యపుస్తకాలపై వున్నాయని, పుస్తకాలు ప్రభుత్వం వెనక్కి తెప్పించింది. తమిళనాడులో స్కూల్ బ్యాగులపై జయలలిత ఫోటోలు ఉన్నా, స్టాలిన్ వాటిని విద్యార్థులకు పంచారు. రాష్ట్రంలో విద్యా శాఖకు మంత్రి లేరు.
వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు బంధు ప్రారంభించలేదు. కేసీఆర్ భయంతోనే పార్లమెంట్ ఎన్నికల సమయంలో రైతు బంధు డబ్బులు రిలీజ్ చేశారు. హోం శాఖ సీఎం దగ్గర వుంది. రేవంత్ రెడ్డి స్వంత జిల్లాలో పట్టపగలు వ్యక్తిని కొట్టి చంపారు. రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తున్నారు. పట్టపగలు దోపిడీలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వడం లేదు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కక్షతో రేవంత్ రెడ్డి వున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్,సెక్రటేరియట్ కేసీఆర్ ప్రభుత్వంలో కట్టిన ఆనవాళ్లు. వాటిని లేకుండా రేవంత్ రెడ్డి చేస్తారా?
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి. రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి. మద్యం,ఇసుక,ఫ్లై యాష్ లో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీగా వున్నారు. హైదరాబాద్ నగరాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన అన్నదమ్ములకు పంచి ఇచ్చారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు అన్ని వెళ్లిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక బిఆర్ఎస్ వాళ్ళను తీసుకుని ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు. 14 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి స్వంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో ఓడిపోయారు. పార్టీ మారిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలి.
రెండు కూటముల మధ్య పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఏ కూటమిలో లేని పార్టీలు నష్టపోయాయి. బీజేపీపై మాట్లాడే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. బొగ్గు బావులను వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకు అప్పగించాలి. బొగ్గుబావులను వేలం వేస్తామని కిషన్ రెడ్డి చెప్తే. కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?
రాజకీయ ప్రేరేపిత ఉదేశ్యంతో విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఏర్పాటు చేశారు. మేము ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాము. బి.హెచ్.ఈ.ఎ.ల్ కు దేశంలో మంచి చరిత్ర వుంది. అలాంటి సంస్థకు మేము పనులు అప్పగించాము. బి.హెచ్.ఈ.ఎల్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.