– దమ్ముంటే రేవంత్ కాంగ్రెస్ రాజీనామా చేసి టీడీపీ నుంచి ఖమ్మం లో పోటీ చేసి గెలవాలి
– దిమ్మెలు కూల్చమంటావా ?.. నువ్వు సీఎం వా ?.. రౌడీ వా ?
– కేసీఆర్ తెలంగాణ తేకపోతే రేవంత్ ఎవడు కౌన్ కిస్కా ?
– కేసీఆర్ మీద పిచ్చిగా మాట్లాడితే రేవంత్ నాలుక కోసేస్తాం
– సీఎం భాష మారకపోతే కాంగ్రెస్ మూతిపండ్లు రాలిపోతాయి.
– బీ ఆర్ ఎస్ నేత గట్టు రాంచందర్ రావు, .మన్నె గోవర్ధన్ రెడ్డి
హైదరాబాద్: నిన్న సీఎం రేవంత్ ఖమ్మం నుంచి పిచ్చి కూతలు కోశారు. చరిత్ర తెలియని చరిత్ర హీనుడు రేవంత్. మంత్రుల మీద కథనాలు రాయించింది రేవంత్ రెడ్డి. వాటి నుంచి దృష్టి మరల్చడానికి బీ ఆర్ ఎస్ దిమ్మెలు కూ ల్చమంటున్నాడు. కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తారట ఆయన చట్టాలు చేస్తాడట.
కమ్యూనిస్టులు పోరాడింది ఈ రెండేళ్లలో ఎక్కడ? ఆయన చట్టాలు చేసింది ఎక్కడ ?
అమరవీరులకు నివాళులర్పించేందుకు తెలంగాణ వచ్చింది తప్ప ..ఎన్ఠీఆర్ కో, వై ఎస్ ఆర్ కో నివాళులర్పించేందుకు కాదు సీఎం. ఎన్ఠీఆర్ కు నివాళిగా బీ ఆర్ ఎస్ దిమ్మెలను ద్వంసం చేయాలట. ఎన్ఠీఆర్ ఉన్న నాడు బీ ఆర్ ఎస్ ఉందా ?
చంద్రబాబు టీడీపీ ని కదా కేసీఆర్ తెలంగాణ లో ఓడించింది. చరిత్ర తెలియకుండా సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడు. దమ్ముంటే రేవంత్ కాంగ్రెస్ రాజీనామా చేసి టీడీపీ నుంచి ఖమ్మం లో పోటీ చేసి గెలవాలి. రేవంత్ కు డిపాజిట్ దక్కితే దేనైకైనా సిద్దమే.
.వై ఎస్ ను బతికుండగా ఎన్ని సార్లు తిట్టావ్ రేవంత్? ఇపుడు పొగడుతున్నావ్. కమ్యూనిస్టులను ఎంత మందిని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ? ..రేవంత్ ఎదో వాళ్ళ మీద ప్రేమ కురిపిస్తున్నారు. రేవంత్ తీరు బీజేపీ లోకి చంద్రబాబు ద్వారా అన్నట్టు ఉంది.
ఢిల్లీ లో రాహుల్ గాంధీ తో తాళి కట్టించుకున్నావ్ ..ఇక్కడేమో చంద్రబాబు తో సంసారం ..ఇదేమి నీతి రేవంత్? రాక్షసుడికి మించిన రాక్షసుడు రేవంత్. . కేసీఆర్ మీద రేవంత్ విమర్శలా ? దిమ్మెలు కూల్చమంటావా ? నువ్వు సీఎం వా ? రౌడీ వా ?
మంత్రులు సీఎం దిమ్మెలు కూల్చమనడాన్ని సమర్థిస్తారా ? నువ్వు ఇచ్చిన హామీలే నిన్ను రాజకీయంగా బొంద పెడుతాయి. ప్రజలే నిన్ను బొంద పెడతారు. జనం మీద ప్రజల మీద పడి ఎందుకు తిడుతున్నారు? మంత్రులు సీఎం భాష ను మార్చాలి. మున్సిపల్ ఎన్నికల్లో సీఎం భాష మారకపోతే కాంగ్రెస్ మూతిపండ్లు రాలిపోతాయి.
ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి . రేవంత్ రెడ్డి చేసిన పనికి చంద్రబాబు ఏపీ పారిపోయారు. రేవంత్ ఏ రోటి కాడ ఆ పాట పాడుతున్నారు. కాంగ్రెస్ సీఎం వా ?టీడీపీ సీఎం వా ? బీ ఆర్ ఎస్ దిమ్మెలు టచ్ చేస్తావా ? దిమ్మె కాదు కదా జెండా తాడు కూడా టచ్ చేయలేవు. బీ ఆర్ ఎస్ అంటే ఆషామాషీ పార్టీ యా ? ఉద్యమ పార్టీ.
కేసీఆర్ తెలంగాణ తేకపోతే రేవంత్ ఎవడు కౌన్ కిస్కా ? సీఎం అయ్యేవారా ?
టీడీపీ వాళ్ళ ఓట్లు కావాలంటే వాళ్ళ కళ్ళు పట్టుకో ..దిమ్మెలు కూలగొట్టమంటావా ?
హామీల అమలు మీద దృష్టి పెట్టు .ఎన్నాళ్ళు ఈ దృష్టి మళ్లించే రాజకీయాలు ?గ్రేటర్ హైదరాబాద్ లో వీధి దీపాలు వెలగడం లేదు ..పారిశుద్ధ్యం పడకేసింది. కరెంటు సరిగా రావడం లేదు .ఇవన్నీ సరి చేయడం చేత కాదు కానీ పెద్దపెద్ద మాటలా ? చేతకాక పోతే సీఎం పదవి నుంచి తప్పుకో.
యూరియా ఇవ్వడం చేతకాదు కానీ సిగ్గు లేని మాటలా ? కేసీఆర్ సంక్షేమం కన్నా ఎక్కువ చేస్తే నిన్ను ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. తొక్కుకుంటూ పోతా అంటావ్ కదా ..ప్రజలే నిన్ను తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు.. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు .ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది.
కనీసం ఖైరతా బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో నైనా రాజీనామా చేయించండి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ 250 సీట్ల లో గెలవడం ఖాయం. ఎంత కండ కావరం ఉంటె బీ ఆర్ ఎస్ గద్దెలు కూలుస్తా అంటావ్? కేసీఆర్ మీద పిచ్చిగా మాట్లాడితే రేవంత్ నాలుక కోసేస్తాం. కేసీఆర్ వ్యక్తి కాదు. శక్తి నువ్వు సీఎం సీటు నుంచి పక్కకు రా. .వెయ్యి మీటర్ల లోతున నిన్ను బొంద పెడతాం. తిట్లు బంద్ చేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు