Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి

– మంత్రి కొండా సురేఖ

హన్మకొండ: నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హన్మకొండలోని డిసిసి భవన్ లో నిర్వహించిన పార్టీ అంత్గత సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గడప గడపకు చేరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసే దిశగా పార్టీ కేడర్ సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని నేతలు, కార్యకర్తలకు మంత్రి సురేఖ కోరారు. ఆ రోజున కాళోజీ కళా క్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొననున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, హనుమకొండ జిల్లా డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , వరంగల్ డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ , ఎంపీలు బలరాం నాయక్ , కడియం కావ్య , జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి , పలువురు కార్పోరేషన్ ఛైర్మన్ లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE