– బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: ఇప్పటికే ఒక్కొక నియోజకవర్గానికి 4,5 గురుకులాలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చి రేవంత్ కొత్తగా చేసేదేమీ లేదు. కొత్తవి పెట్టడం మాట పక్కన పెడితే ఉన్న స్కూళ్లను మూసేయకుండా ఉంటే చాలు. ఉన్న స్కూళ్లకు కొత్త భవనాలు ఇవ్వండి.
ముందు ఉన్న గురుకులాలకు సరిపోయే స్టాఫ్, టీచర్లు, వార్డెన్లను, వసతులు ఇవ్వాలి.. మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. ప్రతి ఏటా దాదాపు రూ.20 వేల కోట్లు మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు