– తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన లో తెలంగాణ బిడ్డలకు స్థానం కల్పించాలి
– రేవంత్ రెడ్డే ఆ ప్యానెల్ తయారు చేశారా ?
– ఇంకెవరైనా చెబితే చేశా రా ?
– మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్
హైదరాబాద్: విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఓ రివ్యూ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో రెండు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈ వ్యవహారాన్ని చూస్తుందని సీఎం చెప్పారు. ఇందుకోసం అడ్వయిజరీ పానెల్ కూడా సీఎం ప్రకటించారు. ఇందులో మోహన్ గురుస్వామి తప్ప తెలంగాణ వారికి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. 30 మంది లో తెలంగాణ బిడ్డలకు ఎందుకు చోటు ఇవ్వలేదు. అడ్వైజరీ పానెల్ లో చోటు దక్కించుకున్న వారంతా వర్చ్యువల్ గా మీటింగ్ లకు హాజరయ్యే వారే . సోనియా గాంధీ గతం లో ఏర్పాటు చేసిన ప్యానెల్ లో సైతం, ఇద్దరు తెలంగాణ బిడ్డలు హనుమంత రావు ,జయప్రకాష్ నారాయణ్ ఉండేవారు.
అమెరికా లో సైతం తెలంగాణ బిడ్డలు ఆ గవర్నమెంట్ కు సలహాదారులుగా ఉన్నారు. అనేక దేశాల్లో తెలంగాణ బిడ్డలు ఆయా ప్రభుత్వాలకు సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయం లోనూ తెలంగాణ బిడ్డలు తమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన లో తెలంగాణ బిడ్డలకు ఇప్పటికైనా స్థానం కల్పించాలి. రేవంత్ రెడ్డే ఆ ప్యానెల్ తయారు చేశారా ?ఇంకెవరైనా చెబితే చేశా రా ? 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాక కే టీ ఆర్ తో చర్చించి మా పార్టీ వైఖరి వెల్లడిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్ లో భాగంగా తెలంగాణ ను మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామంటున్నారు ఈ జోన్ల నామకరణం కూడా బాగాలేదు.
కోర్ ,ప్యూర్ ,రేర్ అనే జోన్లు పూర్తిగా అశాస్త్రీయంగా ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి విధానం ఈ జోన్ల ఎంపిక లో కనిపిస్తుంది. వరంగల్ ,మహబూబ్ నగర్ లాంటి పోటెన్షియల్ నగరాల అభివృద్ధి ఈ జోన్ల ఎంపిక తో వెనక్కి నెట్టేయబడుతుంది. ఇదొక ఫాల్తూ నిర్ణయం. హైదరాబాద్ తప్ప మిగిలిన గ్రామీణ తెలంగాణ ను నిర్లక్ష్యం చేసే కుట్ర కనిపిస్తోంది. డిసెంబర్ 9 న జరిగే సమావేశం లో రేవంత్ రెడ్డి తన తప్పుడు నిర్ణయాలను సమీక్షించుకోవాలి. రేవంత్ రెడ్డి ఆలోచనా విధానం ఇలానే ఉంటే 2047 కాదు కదా ఇంకెన్నాళ్ళయినా ఫలితాలు రావు. 2047 గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకా మూడేళ్లే.
చైనా లో కోర్ సిటీ లే కాదు చిన్న పట్టణాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక లు ఉంటాయి. కేసీఆర్ ,కే టీ ఆర్ ల మార్గ నిర్దేశం లో పదేళ్ల బీ ఆర్ ఎస్ పాలన లో చిన్న పట్టణాల అభివృద్ధి కి కూడా ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రూపొందించేటపుడు ఈ లోపాలు అన్నిటిని సరిదిద్దాలి. ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేతలు చిరుమళ్ల రాకేష్ కుమార్ ,పల్లె రవికుమార్ , గోసుల శ్రీనివాస్ యాదవ్ , కార్తీక్ రాయల పాల్గొన్నారు.