– ఆ భూమిలో కొనసాగుతున్న క్రషర్ యూనిట్‌ను తక్షణమే రద్దు చేయాలి
– ఇది అమ్మవారి కృపతో జరిగిన ధర్మ విజయం
– మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు
హైదరాబాద్: కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను పీఠానికే కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం. కోకాపేటలో శారదా పీఠం భూములను జలమండలికి కేటాయించిన నిర్ణయాన్ని రద్దు చేయడం రాజ శ్యామలా దేవి అమ్మవారి కృపతో జరిగిన ధర్మ విజయం. ఇది భక్తుల విజయం! ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరియైన బుద్ధి ప్రసాదించిన రాజ్య శ్యామల అమ్మవారికి నమస్సులు.
ఎలాంటి స్పష్టమైన ప్రజా ప్రయోజన ప్రతిపాదిక లేకుండా, పర్యావరణ నియమ నిబంధనలకు విరుద్ధంగా , ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ, నామినేషన్ పద్ధతి లో మీ అల్లుడి అనుయాయులకి HMDA ద్వారా కేటాయించిన 17 ఎకరాల భూమి సంగతి ఏమిటి? ఆ భూమిలో కొనసాగుతున్న క్రషర్ యూనిట్‌ను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకునే రేవంత్ ప్రభుత్వం చర్యలపై బీఆర్ఎస్ గట్టిగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది.