– కొండంగల్ వేదికగా నీ రాజకీయ పతనం ప్రారంభ.
– బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
హైదరాబాద్: నూతన సర్పంచులతో పరిచయ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ వేదికగా నిర్వహించిన సమావేశంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ, నాయకులపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ సీఎం భాషా తీరుపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా వివేకానంద్ మాట్లాడుతూ….ఎస్ఎల్బిసి, రంగారెడ్డి, కల్వకుర్తి, కొడంగల్ ప్రాజెక్టులపై కేసీఆర్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మాట్లాడే రేవంత్ రెడ్డి, ఎస్ఎల్బీసీ పనులు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80- 90% పనులు పూర్తయ్యాయనే దానిపై నోరు మెదపవెందుకు? గత రెండేళ్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎన్ని నిధులు ఇచ్చారో, ఎంత శాతం పనులు పూర్తయ్యాయో కొడంగల్ ప్రజలకు చెప్పాలి.
మర్యాద ఉడదని మాట్లాడతలేము అంటున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మల్లన్నసాగర్ లో ఉరివేసుకొని చచ్చిపోతావ్ అనడం, బ్రోకర్లనడం, పదే పదే ప్రసంగంలో నీ అమ్మ అని అనడం, నల్లికుట్లోడు అనడం ఇదేనా నీ మర్యాద, ఇదేనా నీ భాష? నీ మర్యాద, నీ భాషకు తెలంగాణ ప్రజలు ఇలాంటి వ్యక్తా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జడ్పిటిసి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన నీకు.. పాలనలో ఎంత పట్టు ఉందో గత రెండువేల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూస్తేనే తెలుస్తుంది. నీ దొంగ ముచ్చట్లు, కల్లబొల్లి మాటలు నమ్మలేని కొడంగల్ ప్రజలు ఎమ్మెల్యేగా ఒడిగొట్టింది నిజం కదా? నేడు కొడంగల్ ప్రజలపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆడుతున్న నాటకాలను ప్రజల గమనిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ అనేది ఆదాయాన్ని పెంచుతుంది, తెలంగాణ అభివృద్ధిని పెంచుతుంది అని చెప్పే నీకు, తెలంగాణలో గత రెండేళ్ల కాలంలో భూముల రేట్లు ఏ విధంగా పడిపోయాయో తెలీదా? భూములు కొనే నాథుడే లేడు.
గత రెండేళ్ల కాలంలో పడిపోయిన భూముల రేట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలు తద్వారా ఆత్మహత్యలకు పాల్పడిన రియల్టర్లు కనిపించడం లేదా?కొడంగల్ ప్రజలు బయటకు వెళ్లి చదువుకోవడం కాదు, బయటి వాళ్ళే కొడంగల్ కు వచ్చి చదువుకునేలా 250 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ ను తయారు చేస్తున్నామని చెప్పే నీకు…. ఉపాధి లేక, రాష్ట్రంలో అభివృద్ధి లేక ప్రజలు వలసల బాట పడుతుంది కనబడటం లేదా?
2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ కాదు నువ్వొక్కడివి గెలుస్తావో, లేదో చూసుకో.? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నీకు, నీ పార్టీకి కర్రుకాచి వాత పెట్టడానికి తెలంగాణ ప్రజల సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం కాల కూట విషం కాదు, తెలంగాణ ప్రజలకు సంజీవని.
కాంగ్రెస్ పార్టీ నయవంచన చేస్తూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల పట్ల కాలకూట విషంగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది.
నేనుంతవరకు బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానివ్వను అని చెప్పే రేవంత్ రెడ్డి…. వచ్చే ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీని బొందపెట్టైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి తిరిగి ప్రజలు పట్టం కడతారు.
పోరంబోకు మాటలు.. సంతలో మాట్లాడుకో అని అనే నువ్వా మాట్లాడేది భాష గురించి? నువ్వు మాట్లాడే భాష ఎట్లాంటిదో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాషనా ఇది? తెలంగాణలో ప్రతిపక్షం లేదని చింతగా ఉన్న నీకు 2028 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చి నీకు గట్టి బుద్ధి చెప్పి నీ చింతను తీరుస్తాం.