Suryaa.co.in

Telangana

ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనేదే రేవంత్ కుట్ర

– మాజీ మంత్రులు, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే అరెస్టు లా గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులపై నిలదీస్తే కేసులా?

తెలంగాణ రాష్ట్రం లో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనేదే రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర. ఈ కుట్ర లో భాగంగానే తెలంగాణ లో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ లు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కారు ఏడాది పాలనలో హామీలను విస్మరించిందని, అభివృద్ధి లేకపోగా తెలంగాణ ఆగమైందన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని చెప్పిన రైతులపై అక్రమంగా సర్కారు కేసులు బనాయించి జైలుకు పంపిందన్నారు.

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలనా కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలనగా అని అన్నారు. ఇందుకేనా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది? మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి తోపాటు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చేయాలన్నారు.

LEAVE A RESPONSE