Suryaa.co.in

Telangana

అవినీతి పునాదులపై నడుస్తున్న రేవంత్ సర్కారు

సీఎం అసెంబ్లీ లో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు?
ప్రతిపక్ష గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారు?
కేంద్రబడ్జెట్ భేష్
బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర రెడ్డి

హైదరాబాద్: తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తారు.డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే చర్చ పెట్టారు. 31 లోపు అప్రప్రియేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? బీ అర్ ఎస్ మాదిరిగానే మూడు నాలుగు రోజులు బడ్జెట్ సెషన్ పెట్టడం అప్రజాస్వామికం.మేము 18 అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లాము.అందులో ఒక్కటి రెండు అంశాలే చర్చకు వచ్చే అవకాశం.

వ్యవసాయం , ఇరిగేషన్ , సాగు. నీరు , ఉద్యోగాల ఖాళీలు , భర్తీ , మహిళల హామీ మీద , విద్య రంగ సమస్యలు , పంచాయతీ రాజ్ శాఖ సమస్యలు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే హామీల మీద , పౌర సరఫరాల శాఖ మీద జరిగే అక్రమాల మీద , గృహ నిర్మాణ శాఖ , పెన్షన్లు , రెవిన్యూ శాఖ అవినీతీ …. ఇలా 18 రోజులు రోజుకి ఒక్క అంశం మీద చర్చ పెట్టాలని డిమాండ్ చేశాం.

ఈ ప్రభుత్వం అవినీతి పునాదుల మీద నడుస్తోంది.కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యుల కలను సహకారం చేసేలా ఉంది. పేదల సంక్షేమానికి పెద్ద వేసేలా ఉంది.ఇది విజినరీ బడ్జెట్. యువతకు పెద్ద పీట వేసే బడ్జెట్.

LEAVE A RESPONSE