– జిల్లాల్లో 90 శాతం వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ .
– మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి ని రీజినల్ క్యాన్సర్ కేర్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నాం.
– మున్సిపాలిటీలలో ఏ వార్డుకు వెళ్లిన ప్రజల నుంచి మంచి స్పందన ఉంది *
– మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం
– షాద్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి లతో మంత్రి దామోదర్ రాజనర్సింహ కలసి మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టమన్నారు.
అదే మున్సిపాలిటీకి విజయం అందిస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కోన్నారు . శుక్రవారం షాద్ నగర్ స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం లో మంత్రి ఎన్నికలపై మీడియా తో మాట్లాడారు రాష్ట్రవ్యాప్తంగా 75 నుంచి 80% సీట్లు కాంగ్రెస్ అందుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
మహిళా సాధికారికత కోసం వడ్డీ లేని రుణాలు, విద్యా, వైద్య రంగాల్లో పెను మార్పులు, ఉచిత బస్సు, గృహలక్ష్మి పథకాలు. పాలమూరు లాంటి వెనుకబడిన జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు, త్రిబుల్ ఐటీ కళాశాల, ఏకీకృత పాఠశాలల నిర్మాణాలు, రేషన్ కార్డులు, ఉద్యోగాల నియామకాలు ఇలా అన్ని రంగాలలోనూ తమ ప్రభుత్వం సత్తా చాటిందన్నారు.
అందుకే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం కనిపిస్తుందని, అదే కాంగ్రెస్ కు విజయాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీలలో ఏ వార్డుకు వెళ్లిన ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, వారి సమస్యలు, కష్టాలు విని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం..
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం.. భవిష్యత్తులో అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం ఉండేలా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు.
షాద్ నగర్ పట్టణంలో 14 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అందెమోహన్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా లక్ష్యంగా వైద్య రంగాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.