శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబరు 8న బుధవారం ఉదయం 11.52 గంటలకు పంచమీ తీర్థం(చక్రస్నానం) ఏకాంతంగా జరుగనుంది. ఆలయం వద్దగల వాహన మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
డిసెంబరు 9న పుష్పయాగం
బ్రహ్మోత్సవాల మరుసటి రోజైన డిసెంబరు 9వ తేదీ గురువారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణముఖ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.