Suryaa.co.in

Andhra Pradesh

నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ళ దాడి!

– సీఆర్‌పీఎఫ్‌ అలర్ట్‌తో దుండగుల పరార్‌

నడికుడి: నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ళ దాడి జరిగింది. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం నడికూడి స్టేషన్ నుండి రైలు రాత్రి 1:30 బయలు దేరి బి క్యాబిన్ నుండి అండర్ బ్రిడ్జి సమీపానికి వెళ్తున్న సమయంలో దొంగలు ఏసీ బోగీలపై రాళ్ళతో దాడి చేశారు. రైలులో మొత్తం 16 బోగీలు ఉన్నాయి. దాడిలో ఎనిమిది మంది దుండగులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. దాడి ఘటనను పసిగట్టిన సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు వేపన్లతో డోర్లు తీయడంతో దుండగులు పరారయ్యారు.

LEAVE A RESPONSE