– జగనన్నకు మహిళాలోకం జేజేలు పలుకుతోంది
– ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని టిడిపి రాజకీయం
మంత్రి రోజా మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1- గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష వేయడాన్ని స్వాగతిస్తున్నాను. గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
– దిశ స్ఫూర్తితో రమ్య హత్య జరిగిన పది గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు, ఐదు రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేసి, త్వరితగతిన విచారణ జరిగే విధంగా, దిశ ప్రత్యేక న్యాయవాదితో వాదనలు వినిపించారు.
2- 9 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్షపడేలా చేయడం జగన్ గారి పరిపాలన గొప్పదనమే.
– దిశచట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే.. 21 రోజుల్లోనే కచ్ఛితంగా తప్పు చేసిన నిందితులను ఉరితీయవచ్చు.. తద్వారా తప్పు చేయాలంటేనే భయం ఉంటుంది, ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని జగన్ గారు చెప్పంది ఈ రోజు అందరికీ అర్థం అయ్యి ఉంటుంది.
3- దిశ చట్టం ఇంకా అమల్లోకి రాకపోయినా.. దిశ స్ఫూర్తితో.. సీసీ కెమెరాల సాయంతో 10గంటల్లోపే నిందితుడిని అరెస్ట్ చేసి, దిశ కింద కొత్త ల్యాబ్ లు, సామర్థ్యం పెంపుతో వేగంగా ఫోరెన్సిక్ ఫలితాలు తీసుకువచ్చి, దిశ ప్రత్యేక న్యాయవాదితో విచారణ త్వరితగతిన జరిపించి నిందితుడైన శశికృష్ణకు ఉరిశిక్ష పడే విధంగా చేశారు.
4- ఈరోజు మహిళా లోకం అంతా జగనన్న కు జేజేలు పలుకుతుంది.. దిశా చట్టం విలువ ఈ రోజు అర్థం అయ్యింది.
– ఇక మీదట ఆడపిల్లలను కన్నెత్తి చూడాలంటేనే, దాడి చేయాలంటేనే భయపడే పరిస్థితి.. అమ్మాయిలపై దాడి చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ రోజు అర్థం అయింది.. తప్పు చేయడానికి కూడా ఇక భయపడతారు.
5- ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలనే ప్రయత్నం టీడీపీ చేస్తుందే తప్ప అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఏనాడూ ప్రయత్నించలేదు. చంద్రబాబు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిర్వహించారా? దిశా లాంటి చట్టాలను తీసుకువచ్చారా? దిశ యాప్ ను తీసుకువచ్చి, 5నుంచి 10 నిమిషాల్లోనే ఆడబిడ్డలకు రక్షణ కల్పించిన సంఘటనలు ఉన్నాయా? దిశా పోలీస్ స్టేషన్ లను తీసుకొచ్చారా? అసలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆడబిడ్డల రక్షణ గురించి ఆలోచించకుండా.. ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తూ ఆడవారిని అవమానిస్తున్న తెలుగుదేశం పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
6- మహిళలంటే అమితమైన గౌరవం కలిగిన సీఎం శ్రీ జగన్ గారు దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న 900 మంది మహిళలను కాపాడారు.. దాదాపు కోటి 20లక్షల మంది మహిళలు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు – ఆడబిడ్డకు ఏ అవసరం వచ్చినా, ఎటువంటి
అనుమానం కలిగినా సరే వెంటనే దిశ యాప్ ను ఉపయోగించాలని ప్రతీసారి చెబుతున్నాం.
7- రమ్య ఘటన చాలా దురదృష్టకరం.. శశికృష్ణ లాంటి మృగాలు ఇంకా సమాజంలో కొంతమంది ఉన్నారు. వారందరినీ ఏరిపారేయాల్సిన అవసరం ఉంది.
– రమ్య కుటుంబాన్ని సీఎం జగన్ గారు పరామర్శించి, అండగా ఉండడమే కాకుండా.. ఆ కుటుంబానికి 10లక్షలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవడం, 5 ఎకరాల భూమి, కుటుంబ సభ్యల్లో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేసి రమ్య ఆత్మకు శాంతి కలిగించారు.
8- రాష్ట్రంలో ఏ ఒక్క మహిళపై కూడా ఎటువంటి అఘాయిత్యం జరగకుండా జగన్ గారి ప్రభుత్వం అన్ని రకాలుగా వారి రక్షణకు చర్యలు తీసుకుంటుంది. పోలీసుల రక్షణ, దిశ యాప్ ను ఉపయోగిస్తున్నావారికి వెంటనే రిజల్ట్స్ వస్తున్నాయి.
– ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పుతో మహిళలకు ఒక భరోసా వచ్చింది. దిశ చట్టం అమలులోకి వచ్చే లోపే ఇలాంటి చరిత్రాత్మక తీర్పు రావడం చాలా అభినందనీయం.
కేటిఆర్ వ్యాఖ్యలపై
– కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడి ఉంటారని నేను అనుకోవట్లేదు.. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలు అన్నారు కానీ, ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడా అనలేదు..
– ఒకవేళ ఆయన ఏపీ గురించి అని ఉంటే.. తీవ్రంగా ఖండిస్తున్నాను.
– టూరిజం అండ్ యూత్ మినిస్టర్ గా కేటీఆర్ ని రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను.. ఏపీకి రండి..
– జగన్ ని దేశమంతా ఆదర్శంగా తీసుకున్నారు.. ఆయన తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలను, విప్లవాత్మక మార్పులను కేటీఆర్ గారికి దగ్గరుండి చూపిస్తాను..
– నాడు-నేడు ద్వారా బడులు, ఆస్పత్రులను ఏ విధంగా తీర్చిదిద్దారో చూపిస్తాను, రోడ్లు ఏ విధంగా వేశారో చూపిస్తాను.. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు, ప్రజల గడప వద్దకే అందుతున్న సేవలను చూపిస్తాను.. కేటీఆర్ ఇవ్వన్నీ చూసిన తర్వాత తెలంగాణలో కూడా ఇటువంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేయాలని అనుకుంటారు.