-నదుల అనుసంధానం చేసిన అపర భగీరథుడు చంద్రబాబు
– ఇసుకాసురుడు జగన్ రెడ్డి
– నారా లోకేష్ ను కలిసిన అనంతవరం గ్రామస్తులు
పెదకూరపాడు నియోజకవర్గం అనంతవరం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామానికి నాగార్జున సాగర్ నీరు అందక ఆయకట్టు కింద ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
• గోదావరి – పెన్నా – కృష్ణా నదులను అనుసంధానంలో భాగంగా వైకుంఠపురం నుండి సాగర్ ప్రధాన కాల్వకు నకరికల్లు వద్ద కలిపితే 9లక్షల ఎకరాలకు నీరందించే అవకాశముంది.
• ప్రస్తుతం సాగర్ ఆయకట్టు భూములకు సరిగా నీరందకపోవడంతో బీడు పెట్టుకోవాల్సి వస్తోంది..నదుల అనుసంధానం చేస్తే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.
• గ్రామంలోని ఎస్సీలు ఇళ్ల స్థలాలు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.
• బీసీ కాలనీకి దక్షణ భాగంలో వాగులో 4 అడుగుల నీరు నిల్వ ఉండే ప్రాంతంలో స్థలాలివ్వడంతో నిర్మాణ పనులు చేయడానికి కూడా అధికారులు మందుకు రావడం లేదు.
• మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కాలనీకి పడమర భాగాన ఉత్తభాగాన స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించాలి
• గ్రామానికి దక్షిణ భాగాన ఉన్న పొలాలకు వెళ్లాలంటే వాగులు దాటుకుని వెళ్లాల్సి వస్తోంది.
• పొలాలకు వెళ్లే సమయంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు..మీ ప్రభుత్వం వచ్చాక బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• టీడీపీ చేపట్టిన ప్రాజెక్టులకు పేర్లు మార్చుకోవడం తప్ప నాలుగేళ్లుగా జగన్ చేసిందేమీ లేదు.
• దేశ చరిత్రలోనే నదుల అనుసంధానం చేసిన అపర భగీరథుడు చంద్రబాబు.
• నదుల్లో ఇసుక దోచుకునేందుకు ప్రాజెక్టులనే కొట్టుకుపోయేలా చేశాడు ఇసుకాసురుడు జగన్ రెడ్డి.
• టీడీపీ వచ్చిన వెంటనే నదుల అనుసంధాన పనుల్లో వేగం పెంచుతాం.
• వైసీపీ నేతలకు రాజప్రసాదాలు..సామాన్య ప్రజలకు ముంపు ప్రాంతాల్లో స్థలాలా?
• ఇళ్ల స్థలాల చదును, తక్కువ ధర ఉన్న స్థలాలకు ఎక్కువ నిధుల కేటాయింపులతో సమారు రూ.7 వేల కోట్ల కొట్టేశారు.
• అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాల్లో అవినీతిన సొమ్ము కక్కిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తాం.