Suryaa.co.in

Andhra Pradesh

మదనపల్లికి రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా

చంద్రబాబు ఆదేశాల మేరకు ఘటనపై లోతైన విచారణ

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్గంపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఘటనపై విచారణ కోసం రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, మరికొందరు ఉన్నతస్థాయి అధికారులు మదనపల్లె బయలు దేరారు. ఘటనపై విచారించేందుకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాను అక్కడికి వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యింది.

మరోవైపు ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీజెన్‌కో సీఎండీలను కూడా ఘటనా స్థలానికి వెళ్లి తమ శాఖలకు సంబంధించిన అంశాలపై విచారణ జరపనున్నారు. నాగపూర్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేప్టీ ఇంజరీంగ్ సంస్థ నుంచి నిపుణులను ప్రభుత్వం పిలిపించనుంది. ఫైళ్ల దగ్ధంలో కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. చిన్న ఆధారం దొరికినా వదలకుండా ఘటనకు పాల్పడిన వారిని పట్టుకోవాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అమరావతి నుండి బయలు దేరిన సిసోడియా సాయంత్రం 4 గంటలకు మదనపల్లె చేరుకుంటారు.

LEAVE A RESPONSE