Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులకు రూ.10 లక్షలు సాయం

– మంత్రి లోకేష్‌కు చెక్కులు అందజేత

గుంటూరు: వరద బాధితుల కోసం పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు పిడుగురాళ్ల మాధవి సూచనలతో గుంటూరుకు చెందిన పీఎస్ఆర్ ఇన్ ఫ్రా అధినేత బి.శ్రీనివాసరావు అండ్‌ డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ డైరెక్టర్ లక్ష్మీదేవి రూ.5 లక్షలు సాయం ప్రకటించారు. అలాగే, రజక సంఘం కమిటీ తరఫున బి.శ్రీనివాస్ రావు రూ. 5 లక్షలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని దాతలు శనివారం మంత్రి నారా లోకేష్ కి చెక్కుల రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కినపల్లి బాలయ్య, రాష్ట్ర కార్యదర్శి పోదిలి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య, జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి గడ్డం శ్రీనివాస్ రావు, తెలుగుదేశం పార్టీ బీసీ సీనియర్ నాయకులు ఆత్మకూరి బ్రహ్మయ్య, ప్రముఖ లాయర్ వలేటి నాగేశ్వరావు, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE