– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ జీవనాడి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందిని, నిర్మాణం పూర్తయితే సాగు, తాగునీరుతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ‘సారథ్యం’లో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన మాధవ్… ఉదయం ఛాయ్ పే చర్చ కార్యక్రమం, అనంతరం తిరంగా ర్యాలీ, జిల్లా నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, మామిడి రైతులకు ప్రత్యామ్నాయ వెసులుబాటు, పాడి పరిశ్రమ రైతులకు మద్దతు ధర కల్పించడం, జిల్లా ను టెంపుల్ టూరిజం గా అభివృద్ధి చేసే అంశాలు గురించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంతో పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు, ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, నాయకుల పాల్గొన్నారు.