-సెంట్రల్ లో రూ. 59.55 లక్షల విలువైన బీటీ రోడ్లకు ప్రారంభోత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 58 వ డివిజన్ ఆర్.ఆర్.పేట మలుపు వద్ద రూ. 19.80 లక్షల విలువైన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనతో పాటుగా.. 64 వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీలో రూ. 39.75 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ, స్థానిక కార్పొరేటర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నియోజకవర్గంలో రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. నాడు – నేడు ద్వారా చేసిన ప్రగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు చూపుతున్నామన్నారు. కానీ చేసిన అభివృద్ధి చెప్పుకోలేక టీడీపీ నేతలు అనుచితంగా మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరే ఓటీఎస్ వంటి పథకాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయిందో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రూ. 60 వేలు చెల్లించి మోసపోయిన బాధితులకు.. ఈ ప్రభుత్వ హయాంలో ఇళ్ల దస్తావేజులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. దేశం మొత్తం మెచ్చేలా సుపరిపాలనలో దూసుకుపోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మరో 25 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. నిత్యం ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజావసరాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు తీరుస్తున్నారన్నారు. టీడీపి హయాంలో మాదిరిగా కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టకుండా.. అనతికాలంలోనే ప్రారంభోత్సవాలు చేసి ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామన్నారు.
డిప్యూటీ మేయర్ అవుతు శైలజ మాట్లాడుతూ.. గత తెలుగుదేశం పాలకులకు నియోజకవర్గంలో జర్నలిస్ట్ కాలనీ ఉందని కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కానీ ఈ ప్రభుత్వం కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు యర్రగొర్ల తిరుపతమ్మ, అలంపూర్ విజయలక్ష్మి, జానారెడ్డి, నాయకులు అవుతు శ్రీనివాస్ రెడ్డి, అలంపూర్ విజయ్, యరగొర్ల శ్రీరాములు, ఇసరపు రాజా, కాళ్ల ఆదినారాయణ, నేరెళ్ల శివ, నార్ల వెంకటేశ్వరరావు, జిల్లేల్ల శివ, పందిరి వాసు, సీహెచ్ రవి, యేసు, ఇస్మాయిల్, ఈఈ శ్రీనివాస్, డిఈ గురునాథం, పార్టీ శ్రేణులు, వీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.