Suryaa.co.in

Telangana

కరోనాతో చనిపోయిన జలమండలి ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహాం చెల్లించాలి

– ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి, కార్ గార్ యునియన్ ప్రెసిడెంట్ డా. దాసోజు శ్రవణ్ డిమాండ్
– కరోనా వల్ల చనిపోయిన జలమండలి ఉద్యోగుల కుటుంబాలకు కామ్ గార్ యునియన్ తరపున 10వేల రూపాయిల ఆర్ధిక సాయం అందించిన దాసోజు శ్రవణ్

”శక్తి, సంపత్త, సద్భుద్దిని ఇచ్చే మహిళలకు సమానమైన గౌరవం ఇవ్వాలి. జలమండలి మహిళా ఉద్యోగులు హక్కులని కాపాడాలి. జలమండలిలో పని చేసే ఉద్యోగులు చేస్తున్న పని పవిత్రమైనది. కోటి మందికి మంచి నీళ్ళు అవసరాలు తీర్చి, మరుగును పరిశుభ్రపరిచే పని వున్నతమైది. జలమండలి కార్ముకులు సమాజానికి ఆరోగ్యప్రదాతలు. అలాంటి కార్మికుల హక్కులు కోసం కార్ గార్ యునియన్ నిరంతరం పోరాటం చేస్తుంది ”అని ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్
dasiju1 వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డ్ కామ్ గార్ యునియన్ ప్రెసిడెంట్ దాసోజు ఉప్పల్ లో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డ్ కామ్ గార్ యునియన్ నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు . జలమండలి మహిళా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ… జలమండలిలో కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు లంచ్ రూమ్ లు, రెస్ట్ రూంలు లేకపోవడం మహిళ పట్ల వున్న చిన్నచూపుకి నిదర్శనం.ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఇలాంటి పరిస్థితి వుంటే బయట ఎలా వుంటుందో అర్ధం చేస్కుకోవచ్చు. జలమండలిలో శ్రమ దోపిడీ కూడా జరుగుతుంది. ఎనిమిది గంటలు పని చేయాల్సిన చోట అదనంగా మరో రెండు మూడు గంటలు పని చేయిస్తున్న అంశాలు కూడా దృష్టి కి వచ్చాయి. జలమండలి ఉద్యోగులు ఎదురుకుంటున్న ఈ సమస్యలపై యాజమన్యం దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించి, ఉద్యోగుల హక్కులని కాపాడాలని కోరారు దాసోజు.

జలమండలి ఉద్యోగుల హక్కుల కోసం ఉద్భవించిన కామ్ గార్ యునియన్ పీఆర్ఎస్ కొరకు, హెల్త్ కార్డులో వున్న లోపలని ఎత్తి చూపడం కొరకు పోరాటం చేశాం. అదే స్ఫూర్తితో విధి నిర్వహణలో కోవిడ్ సోకి చనిపోయిన దాదాపు 26మంది జలమండలి కార్మికులకు కోటి రూపాయిల నష్ట పరిహారం, బాదితుల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చే వరకూ టీఆర్ఎస్ ప్రభుత్వం, పురపాలశాఖ మంత్రి కేటీఆర్ తో పోరాటం చేస్తామని వెల్లడించారు దాసోజు.

ఇదే సందర్భంలో చనిపోయిన జలమండలి ఉద్యోగుల కుటుంబాలకు కామ్ గార్ యునియన్ తరపున 10వేల రూపాయిల ఆర్ధిక సాయం అదించారు దాసోజు శ్రవణ్. ఇది రాజకీయ లభ్దితో చేయడం లేదని, సానుభూతి కోసం కూడా కాదని, ఇది బాదిత కుటుంబాలకు తాము ఉన్నామని బరోసా కల్పించడానికి మానవతా ద్రుష్టితో స్పందించి అందించిన సాయమని పేర్కొన్నారు దాసోజ. ప్రభుత్వం కోటి రూపాయిలు నష్టపరిహారం చెల్లించే వరకూ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు దాసోజు.కార్యక్రమంలో కామ్ గార్ యునియన్ అసోషియేట్ ప్రెసిడెంట్స్ రామరాజు, భుమయ్యా , జనరల్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE