Suryaa.co.in

Andhra Pradesh

తన కమీషన్లు దోపిడీతో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేశాడు

• 4ఏళ్లలో 7సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.57వేల కోట్ల భారం మోపాడు
• స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ ని అదానీ సంస్థకు, ట్రాన్స్ ఫార్మర్ల బిగింపు కాంట్రాక్ట్ ని షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు కట్టబెట్టి.. ప్రజలపై అదనపు భారంవేస్తూ వేలకోట్ల దోపిడీకి సిద్ధమయ్యాడు
• 4ఏళ్లలో జగన్ రెడ్డి ఒక్క మెగావాట్ విద్యుత్ అదనంగా ఉత్పత్తిచేసిందిలేదు.
• విద్యుత్ రంగంలో ఒక్క ఉద్యోగం కొత్తగా ఇచ్చిందిలేదు. ప్రజలపై విద్యుత్ ఛార్జీలభారం.. కోతలుతప్ప.
• 2014కు ముందు 22.5మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటులో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబుగారు 2014లో 9,529 మెగావాట్ల సామర్థ్యానికి చేర్చి, 2018 నాటికి 19,080మెగావాట్లకు పెంచి, జగన్ రెడ్డికి మిగులు విద్యుత్ ఉత్పత్తితో రాష్ట్రాన్ని అప్పగించారు..
టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ

జగన్ రెడ్డి అవినీతి లూఠీకారణంగా రూ.57,188కోట్ల విద్యుత్ ఛార్జీల భారం రాష్ట్రప్రజలపై పడిందని, ముఖ్యమంత్రి నిర్వాకంతో విద్యుత్ వినియోగదారుల జేబులుఖాళీ అవుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా అప్రకటితవిద్యుత్ కోతలు పెరిగాయని టీడీపీ రాష్ట్రఅధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!

“విద్యుత్ కోతలతో అటు ప్రజలు బెంబేలెత్తిపోతుంటే, పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని కాదని, బయట మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొంటూ కూడా జగన్ రెడ్డి విద్యుత్ కొరతలేకుండా చేయలేకపోయాడు. తనస్వార్థంతో విద్యుత్ రం గాన్ని సర్వనాశనంచేసి గాలికివదిలేశాడు. 4ఏళ్లలో 7సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచాడు. చంద్ర బాబు గారిహాయాంలో రూపాయివిద్యుత్ ఛార్జీ పెంచిందిలేదు. టీడీపీప్రభుత్వం 10వేల మెగా వాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తిచేస్తే, జగన్ రెడ్డి ఈ 4ఏళ్లలో ఒక్కమెగావాట్ కూడా ఉత్పత్తిచే యకపోగా, ఉన్నఉత్పత్తిని కూడా తగ్గించేశాడు.

స్మార్ట్ మీటర్ల బిగింపు కాంట్రాక్ట్ ని రూ.30వేల కోట్లకు అదానీ సంస్థకు కట్టబెట్టి రూ.12వేలకోట్లు కాజేసేందుకు పథక రచన చేశాడు
తాజాగా స్మార్ట్ మీటర్ల బిగింపుపేరుతో రూ.30వేలకోట్లు ఖర్చుకు సిద్ధమయ్యాడు. మీటర్ల బిగించే ప్రాజెక్ట్ ని అదానీ సంస్థకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యాడు. రూ.18వేలవిలువచేసే స్మార్ట్ మీటర్ని రూ.30వేలకుకొనేలా అదానీ సంస్థతో రూ.30వేలకోట్లకు ఒప్పందంచేసుకొని, రూ.12వేలకోట్లు ముడుపులు కాజేసేందుకు సిద్ధమయ్యాడు. పవర్ ఫై నాన్స్ కార్పొరేషన్ ని అడ్డంపెట్టుకొని జగన్ రెడ్డి 4ఏళ్లలో చేసినఅప్పు రూ.36,261కోట్లు. హిందుజాసంస్థకు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.2,800కోట్లు. వీటికితోడు పెంచిన విద్యుత్ ఛార్జీలు భారం మొత్తం ప్రజలపైనే పడనుంది. స్మార్ట్ మీటర్లు బిగించుకునే ప్రతివినియోగదారుడు నెలకురూ.90లచొప్పున ఏడున్నరసంవత్సరాలపాటు, చెల్లించాల్సిఉంది. వాణిజ్య వినియోగ దారులు నెలకురూ.120చొప్పున కట్టాలి.

ఈ విధంగా విద్యుత్ వినియోగదారుల్ని దోచుకో వడం, వారిపైభారీస్థాయిలో భారాలువేయడానికి కారణం జగన్ చేస్తున్నదోపీడీనే. చంద్రబా బుగారు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి, ప్రజలపైభారం పడకుండా కరెంట్ కోతలు లేకుండా,అదనంగా 10వేలమెగావాట్ల విద్యుత్ఉత్పత్తిచేశారు. ఆయనపాలన ఎలాంటిదో, జగన్ రెడ్డి పాలనఎలా ఉంటుందోఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకోవాలి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు అదానీసంస్థను తిరస్కరిస్తుంటే, జగన్ రెడ్డి మాత్రం అతని కమీషన్లు, అవినీతి కేసులనుంచి రక్షించుకోవడంకోసం రాష్ట్రంలోనిపోర్టులు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, విద్యుత్ కాంట్రాక్టుల్ని అదానీసంస్థకే కట్టబెడుతున్నాడు.

గతంలో విద్యుత్ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబునాయుడు చేసుకున్నవిద్యుత్ ఒప్పందాలను రద్దుచేసిన జగన్, నేడు బయట సంస్థలనుంచి అధికధరకు విద్యుత్ కొంటున్నాడు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తిలో రాష్ట్రం ఎక్కడుంది? విండ్ సోలార్ ఉత్పత్తిలో రూ.36వేలకోట్లపెట్టుబడితో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చంద్రబాబుగారు 19,080మెగావాట్లకు పెంచి, 10వేలమెగావాట్లు పెంచారు.. ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చాక ఒక్కమెగావాట్ కూడా ఉత్పత్తికావడంలేదు. చంద్రబాబుచేసిన పనుల్ని, తానెందుకు చేయాలన్న సంకుచితమనస్తత్వంతోనే జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. చంద్రబాబు కష్టపడి, మనసుపెట్టి రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బాగుచేశారు. 2014కు ముందు రాష్ట్రంలో 22.3మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుఉంటే, చంద్రబాబు తన ముందు చూపుతో దాన్నిఅధిగమించి, ఆయన దిగిపోయేనాటికి 19వేలమెగావాట్లతో రాష్ట్రా న్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాడు. ఆసియాలోనే అతిపెద్దదైన మెగాసోలార్ పార్క్ ని కర్నూల్లో ఏర్పాటుచేశారు.

చంద్రబాబు 5ఏళ్లలో 3లక్షల26వ్యవసాయ మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తే, జగన్ ఈ 4ఏళ్లలో లక్షా17వేల కనెక్షన్లు మాత్రమే ఇచ్చాడు. చంద్రబాబు విద్యుత్ రంగంలో 13వేల ఉద్యోగాలు కల్పిస్తే, జగన్ రెడ్డి ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేదు. వీ.టీ.పీ.ఎస్ విద్యుత్ కేంద్రం లో 6యూనిట్ల విద్యుత్ సరఫరానిలిచిపోయి సంవత్సరాలుగడుస్తున్నా, జగన్ రెడ్డి ఇంత వరకు ఆ సమస్య పరిష్కరించలేదు. విజయవాడ థర్మల్ విద్యుత్ ఉత్పత్తికేంద్రం సామర్థ్యం 1760 మెగావాట్లు అయితే, నేడుకేవలం 500మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది.

క్విడ్ ప్రోకో పద్ధతిలో హిందుజాసంస్థకు చెందిన 11ఎకరాల్ని కాజేసేందుకే జగన్ రెడ్డి ఆ సంస్థకు రూ.2,628కోట్లు అప్పనంగా దోచిపెట్టాడు
ట్రాన్స్ ఫార్మర్ల తయారీనికాంట్రాక్ట్ ను కూడా జగన్ రెడ్డి షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకే అప్పగించాడు. సదరుసంస్థచేసిన తప్పులకుప్రభుత్వం మూల్యంచెల్లించుకుంటోంది. ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణచూడాల్సిన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ చేతులెత్తేస్తే, వాటిరిపేర్లకు జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.2,628కోట్లుచెల్లించింది. 2019-20లో రూ.469కోట్లు, 2020-21లో రూ.612కోట్లు, 2021-22లో రూ.945కోట్లు, 2022-23లో రూ.598కోట్లు చెల్లించారు. సాంకే తిక లోపాలముసుగులో ఈ సొమ్ము మొత్తాన్ని షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు దోచిపెట్టారు. హిందుజాసంస్థకు ఇప్పటివరకు రూ.2,834కోట్లు చెల్లించారు. ఆ చెల్లింపులకోసం పవర్ ఫైనా న్స్ కార్పొరేషన్ నుంచి9.5శాతం వడ్డీతో అప్పుతీసుకోవాలని డిస్కంలను ప్రభుత్వం ఆదేశిం చింది. రూ.2,834కోట్లు చెల్లించాల్సిన అవసరంలేదని జ్యుడీషియల్ ప్రివ్యూలో న్యాయ నిపు ణులు చెప్పినాకూడా ముఖ్యమంత్రి చెల్లించాలని ఆదేశించారు. హిందుజాసంస్థకు చెందిన హైదరాబాద్ లోని 11ఎకరాల్ని క్విడ్ ప్రోకో పద్ధతిలోకొట్టేయడానికే ముఖ్యమంత్రి ఈ ఆదేశా లు ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.

బయటి మార్కెట్లో ఒక్కోయూనిట్ కు రూ.4.02పైసలు అదనంగా చెల్లించి విద్యుత్ కొంటూ, ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు
2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యిఅవ్వగానే విద్యుత్ రంగంపై పగబట్టి, రాష్ట్రాన్నివిద్యుత్ కోతలకు కేంద్రబిందువుగా మార్చాడు. రాష్ట్రంలోచౌకగా విద్యుత్ అందించే సంస్థల్ని కాదని జగన్ రెడ్డి తనకమీషన్లకోసం బయటమార్కెట్లో అధికధరలకు విద్యుత్ కొంటున్నాడు. ఆర్టీఐ సమాచారంప్రకారం 2019-20మధ్య రూ.12,200కోట్లతో విద్యుత్ కొన్నారు. సరాసరి మార్కెట్ యూనిట్ కొనుగోలు రూ.8.77పైసలు అయితే, డిస్కంల యావరేజ్ కొనుగోలు రేటు రూ.4.75పైసలు. అదనంగా ఈప్రభుత్వం ఒక్కోయూనిట్ కు రూ.4.02పైసలుచెల్లించి బహిరంగమార్కెట్లో విద్యుత్ కొని, రూ.6వేలకోట్ల భారంప్రజలపై ప్రభుత్వం మోపింది.

థర్మల్ కేంద్రాల్లోని బొగ్గునిల్వలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు…ముఖ్యమంత్రి పట్టించుకోరు
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గునిల్వల సమీకరణలో ప్రభుత్వానికి శ్రద్ధలేదు, ముఖ్యమంత్రి పట్టించుకోరు. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలోమూడు రోజులకు సరిప డా 71,870మెట్రిక్ టన్నుల బొగ్గునిల్వలు మాత్రమే ఉన్నాయి. రాయలసీమ థర్మల్ కేంద్రం లో ఒకటిన్నర రోజుకు సరిపడే 38,535మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేం ద్రంలో రెండురోజులకు సరిపడా 47,901 మెట్రిక్ టన్నులు , హిందుజాపవర్ ప్లాంట్ లో ఒకరోజుకి సరిపడా 13,458 మెట్రిక్ టన్నలు బొగ్గుమాత్రమే నిల్వఉంది. ఈ విధంగా బొగ్గునిల్వలుఉంటే నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తిచేయడం ఎలాసాధ్యమవుతుంది. ముందుచూపుతో 20రోజులు, నెలకు సరిపడా బొగ్గునిల్వలపై ప్రభుత్వం ఎందుకు దృష్టిపెట్ట దు? సెంట్రల్ గవర్నమెంట్ సీజీఎస్ కొనుగోళ్లు ఎందుకు నిలిపేశారనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానంలేదు. ప్రజలపై భారంవేస్తూ, అధికధరలకు విద్యుత్ కొంటూ, ఆఖరికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తికేంద్రాలుసహా, అన్నికేంద్రాలను అదానీసంస్థకు కట్టబెట్టేఆలోచనలో జగన్ రెడ్డి ఉన్నాడు.

చంద్రబాబు హయాంలో 5ఏళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలుపెంచలే లేదు.. ఒక్కగంటకూడా విద్యుత్ కోతలు పెట్టిందిలేదు. టీడీపీప్రభుత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగ స్థితిగతులపై, నేడు ఉన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి సమాధానంచెప్పగలడా? బయటమా ర్కెట్లో అధికధరకు విద్యుత్ కొంటూకూడా జగన్ రెడ్డి కోతలులేకుండా ఎందుకు చేయలేకపో తున్నాడు? కరెంట్ కోతలు లేకుండా చూడాలని పరిశ్రమలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిం చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైతులమోటార్లకు మీటర్లు, గృహలకు స్మార్ట్ మీటర్ల బిగింపుతోకూడా జగన్ రెడ్డి నయాదోపిడీకి సిద్ధమయ్యాడు. ఇప్పటికే జగన్ దోపిడీదెబ్బకు ఆక్వారంగం మూతపడేపరిస్థితికి వచ్చింది. ప్రజలుకూడా నెలనెలావచ్చే కరెంట్ బిల్లులతో, విద్యుత్ కోతలతో అవస్థలుపడుతున్నారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా విద్యుత్ సంక్షోభాన్ని నివారించడానికి ఏంచేస్తాడో చెప్పాలి. వచ్చేఎన్నికల్లో టీడీపీప్రభుత్వం రాగానే చంద్రబాబు గారు తనముందుచూపుతో విద్యుత్ రంగాన్ని తిరిగి ఒకదారిలోకి తెస్తారు.” అని రఫీ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE