Suryaa.co.in

National

పసికూనల ప్రాణాలు తీస్తున్న రష్యా సైన్యం

చిన్నారుల ఆసుపత్రిపై దాడి
41 మంది మృతి

కీవ్‌: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. సోమవారం కీవ్‌లోని చిన్నారుల ఆసుపత్రిపై క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులతో సహా 41 మంది చనిపోయారు. 170 మందికి పైగా గాయపడ్డారు. వివిధ నగరాల్లో రష్యా చేసిన దాడుల్లో 100కు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. దాడి సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పోలండ్‌లో ఉన్నారు. నాటో సమ్మిట్ కోసం ఆయన వాషింగ్టన్‌కు వెళ్లే సమయంలో దాడి జరిగింది.

LEAVE A RESPONSE