Suryaa.co.in

Andhra Pradesh

తుప్పు పట్టిన సైకిల్ ఇక స్మశానానికే

– పేదలకీ పెత్తందార్లకీ జరిగే కురుక్షేత్రంలో విజయం పేదలదే
– రానున్న కురుక్షేత్ర సంగ్రామానికి నువ్వొక్కడివే వస్తావా..? దత్తపుత్రడ్ని తెచ్చుకుంటావా..?
– మేం ఒక్కళ్లమే వస్తాం…జగన్‌ సంక్షేమ సైన్యం వస్తుంది
– చంద్రబాబూ…ఇదే మీకు చివరి మహానాడు
– తుప్పు పట్టిన సైకిల్‌ కు ఎలక్ట్రికల్ స్మశానంలో అంత్యక్రియలు చేయండి.
– నీకూ నీ పార్టీకే భవిష్యత్తు లేదు..ఇక ప్రజలకేమిస్తావ్?
– ఏ ఒక్క హామీనీ అమలు చేయని బాబు..మళ్లీ హామీలిస్తే నమ్ముతారా..?
– నీ జన్మలో ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చావా చంద్రబాబూ..?
– చంద్రబాబు ప్రజల నెత్తిన వాగ్ధానాల టోపీ పెట్టాడు
– ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్నీ అమలు చేసిన నేత వైఎస్‌ జగన్‌
– కులం పేరు ఎత్తితే చెప్పుతో కొట్టాలంటే మొదటిగా మీ తండ్రీ కొడుకులనే కొట్టాలి
– పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే తట్టుకోలేని నువ్వు వారిని ధనవంతుల్ని చేస్తావా..?
– క్యాష్ వార్ బాబుకే అలవాటు: మంత్రి అంబటి రాంబాబు

చంద్రబాబు పదవీ దాహం వల్లే ఎన్టీఆర్‌ మృతి:
– రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది.
– ఈ మహానాడులో ఎన్టీఆర్‌ చరిత్ర, ఆయన గొప్పతనం గురించి పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు.
– ముఖ్యంగా చంద్రబాబు ఎన్టీఆర్‌ని పొగుతున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది.
– కారణం ఎన్టీఆర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తి..73 ఏళ్లకే చనిపోయే వ్యక్తి మాత్రం కాదు.
– ఎన్టీఆర్‌ తాను 85 ఏళ్లు బతుకుతానని అనుకున్నాడని, చివరి మూడేళ్లు తన స్వగ్రామంలో బతకాలని అనుకున్నాడని జస్టిస్‌ చలమేశ్వర్‌ అన్న మాటలు పత్రికల్లో చూశా.
– అలాంటి వ్యక్తి ఎందుకు 73 ఏళ్లకే మరణించాడు..? కారణం అందరికీ తెలుసు.
– చంద్రబాబు పదవీ దాహం వల్ల ఆయన మరణం సంభవించింది.
– తనను అన్యాయం, ద్రోహం చేశారని ఎన్టీఆర్‌ గుండె ఆగి చనిపోయారు.
– ఆనాడు ఎన్టీఆర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చాడు.
– ఇప్పుడు ఆయన్ను ఎంత పొగుడుతున్నారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
– ఏదో ఒక రకంగా ఎన్టీఆర్‌ను మార్కెంటింగ్‌ చేసుకోవాలని ఈ రోజు తాపత్రయపడుతున్నారు.
– ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని నిజంగానే చంద్రబాబుకు ఉందా..? నిజంగా ఇవ్వాలని ఉంటే ఆగేదా..?
– మొన్నీమధ్యనే సినీనటుడు నారాయణమూర్తి మీరు కేంద్రంలో చక్రం తిప్పేటప్పుడు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని నిలదీశాడు.
– ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాల్సిందే..చంద్రబాబుకు సాధించలేకపోయాడు అంటే నీకు సిగ్గేయలేదా..?
– కేవలం ఎన్టీఆర్‌ని మార్కెటింగ్‌చేసుకోవాలనే తాపత్రయమే తప్ప ఆయనకు భారతరత్న ఇప్పించాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదు.

ఇదే మీకు చివరి మహానాడు:
– చంద్రబాబూ ఇదే మీకు చివరి మహానాడు…
– చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ చేతులమీదుగా టీడీపీకి కూడా నూరేళ్లు నిండుతాయి.
– 2019లోనే ప్రజలు దుర్మార్గమైన పరిపాలనను అంతం చేశారు..మళ్లీ అదే పాలనను తీసుకొచ్చే పరిస్థితి లేదు.
– ఈ పార్టీ ఇంతటితో అంతరించి పోతుంది..ఎన్నికల తర్వాత ఉండదు.
– నీ సైకిల్‌ తుప్పు పట్టిపోయింది..నువ్వు తొక్కలేకపోతున్నావ్‌..
– చివరికి మీ అబ్బాయి కూడా తొక్కలేకపోతున్నాడు..అందుకే దత్తపుత్రుడితో తొక్కించుకోవాలి అనుకుంటున్నావ్‌
– ఈ సైకిల్‌ స్క్రాప్‌కు కూడా పనికి రాకుండా 23 సీట్లు వచ్చాయి.
– తుక్కుతుక్కు అయిన సైకిల్‌కి నువ్వు ఎలక్ట్రిఫికేషన్‌ చేయలేవు..
– ఆ సైకిల్‌ని తీసుకెళ్లి విద్యుత్‌ స్మశాన వాటికలో వేసి ఆ బూడిదను ముఖాన రాసుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది.
– చంద్రబాబు తన ప్రసంగం మధ్యలో తమ్ముళ్లు నిజమేనా..అంటాడు..అంటే ఆయన చెప్పేది ఆయనకే అనమానం..
– నువ్వు కార్లు పెట్టి తీసుకొచ్చిన జనమే కదా..అంత అనుమానం ఎందుకు..?

నీ జన్మలో ఒక్క వాగ్ధానం అన్నా నెరవేర్చావా.?:
– అమ్మకు వందనం, యువగళంతో నిరుద్యోగ భృతి…వంటి హమీలెన్నో ఇచ్చాడు.
– చంద్రబాబు నువ్వేమన్నా కొత్తగా పార్టీ పెడుతున్నావా..? నీ గురించి రాష్ట్ర ప్రజలకు తెలియదా..?
– ఇచ్చిన వాగ్ధానాన్ని నీ జన్మ మొత్తంలో ఒకటన్నా అమలు చేశావా..?
– రైతులకు రుణమాఫీ చేశాను అంటున్నాడు..ఎక్కడ చేశావయ్యా..?
– కోటయ్య కమిటి, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అన్నావ్‌..డ్వాక్రా మహిళకు రుణమాఫీ అన్నావ్‌..ఏదైనా చేశావా..?
– అదేమని అడిగితే చేసేశాంగా అంటూ ఘీంకరిస్తాడు…
– నీ 14ఏళ్లు పరిపాలనలో మేనిఫెస్టోలో ఒకటన్నా అమలు చేశావా..?
– నిరుద్యోగ భృతి 3 వేలు ఇస్తావా..? గతంలో ఏం చేశావ్‌…2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చావా..?
– మీరెవ్వరూ ఊహించని విధంగా పరిపాలన చేస్తా అంటే నీ బండారం ప్రజలకు తెలియదా..?
– చివర్లో టోపీ పెట్టుకుని ప్రజల నెత్తిన వాగ్ధానాల టోపీ పెట్టాడు.
– జగన్‌ గారిని దించేయండి…నన్ను అధికారంలోకి తీసుకురండి అనడం తప్ప మహానాడు ఏముంది..?
– నేను చేసిన ఐదేళ్ల పరిపాలనను మళ్లీ తీసుకొస్తా అనే ధైర్యం చేయలేకపోయావు.

ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్నీ అమలు చేసిన నేత వైఎస్‌ జగన్‌:
– ఈ దేశంలో మేనిఫెస్టోని భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి ప్రతి విషయాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ .
– దస్తాలకు దస్తాలు మేనిఫెస్టో ఇచ్చి ఒకటి కూడా అమలు చేయని చరిత్ర చంద్రబాబుది.
– నీ 14 ఏళ్ల పరిపాలన చరిత్రను, ఈ నాలుగేళ్ల జగన్‌ పరిపాలనను బేరీజు వేసుకోండి.

యస్‌…రానున్నది కురుక్షేత్ర యుద్ధమే:
– రానున్నది కురుక్షేత్ర యుద్ధమే…సందేహం లేదు..
– నువ్వొక్కడివే వస్తావా..? ఇంకా ఎవర్నైనా తెచ్చుకుంటావా..?
– మేం ఒక్కళ్లమే వస్తాం…జగన్‌ సంక్షేమ సైన్యం వస్తుంది…
– పేదలకి, పెత్తందార్లకి జరిగే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పేదలదే విజయం.
– పేదవారిని ధనవంతుడిని చేసి..పేదవాళ్లు లేని రాష్ట్రాన్ని చేస్తాడట..
– 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారుగా..అప్పుడెందుకు చేయలేదు..?
– అధికారంలోకి రాననే భయంతో పేదవాళ్లని ధనవంతులను చేస్తాం అంటున్నాడు.
– నువ్వు ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేసిన చరిత్ర నీకు ఉందా..?
– నువ్వు ధనవంతుల్ని చేసింది రామోజీరావు, టీవీ5 నాయుడు, రాధాకృష్ణ, సుజనా చౌదరి, లోకేశ్‌లను తప్ప ఏ పేదవాడిని ధనవంతుడిని చేశావు..?
– ఖరీదైన రాజకీయాలు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి టీడీపీది
– రాజకీయాలను వ్యాపారం చేసింది చంద్రబాబు
– టీడీపీ నీతివంతమైన పార్టీ అంటాడు…నువ్వు తెలంగాణాలో డబ్బులు పంచలేదా..?
– ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు నువ్వంతా డబ్బుపైనే నడిపావు కదా.
– అదే డబ్బుతో చంద్రబాబు సైకిల్‌ గుర్తును కూడా లాక్కున్నాడు.
– ఈ 14 ఏళ్లు చేయని పరిపాలన ఊహించని విధంగా ఇప్పుడు చేస్తావా..?
– దుర్మార్గం చేస్తే…అబద్దాలు చేప్తే పైనున్న ఎన్టీఆర్‌ కూడా సహించడని గుర్తుంచుకోండి.
– ఏదో ఒక విధంగా పోయిన అధికారం తీసుకోవాలని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
– కొంత మంది కల్లు తాగిన కోతిలా మహానాడు వేదికపై వ్యవహరించారు.
– జగన్‌ గారిపై అవాకులు చెవాకులు పేలి నీ మన్ననలు పొందాలనే ప్రయత్నం చేశారు..అది సాగదు.
– మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది..మేం చెప్పంది చేసి చూపించాం.
– నువ్వు చెప్పిందేదీ చేయలేదు..నువ్వెన్ని వాగ్ధానాలు చేసినా ప్రజలెవ్వరూ నమ్మరు.

సెంటు భూమి ఇస్తుంటే అల్లాడిపోయిన నువ్వు పేదవాడిని ధనవంతుడిని చేస్తావా..?
– కులం పేరు తీస్తే చెప్పుతీసి కొట్టాలంటే మొదటిగా చంద్రబాబు, ఆయన కుమారుడినే కొట్టాలి.
– మా రక్తాన్ని కూడా వేరే కులానికి ఇవ్వము అనే పరిస్థితికి నీ పరిపాలన వెళ్లింది.
– పేద వాడికి ఒక సెంటు భూమి ఇవ్వడానికి జగన్‌ గారు ప్రయత్నం చేస్తే ఎంత యుద్ధం చేశావో అందరూ చూశారు.
– సుప్రీం కోర్టు కూడా మొట్టికాయలు వేసినా పత్రికల్లో ఇష్టం వచ్చినట్లు రాయించావ్‌
– పేదవాడికి సెంటు భూమి ఇస్తుంటేనే అల్లాడిపోయిన నువ్వు పేదవాడిని ధనవంతుడిని చేస్తావా..?
– ఈ సారి మీరు నాకు ఓట్లు వేయకపోతే ఇదే నాకు చివరి ఎన్నిక అని గతంలోనే బాబు చెప్పేశాడు.
– అదే జరిగేది..నీ వల్ల కాదు..నువ్వు చేసేవన్నీ మోసాలు..నక్క జిత్తులు.
– ఎన్ని హంగామాలు చేసినా, మోసం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

భవిష్యత్తు గ్యారెంటీ లేని పార్టీ నీది:
– భవిష్యత్తు గ్యారెంటీ లేని పార్టీ నీది చంద్రబాబూ…
– ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జగన్‌ గారిని ఇష్టారీతిన మాట్లాడుతున్నావు.
– నీ కుమారుడు వయసున్న జగన్‌గారిపై ఆక్రోశాన్ని చూపిస్తున్నావు అంటే జగన్‌ గారు అత్యంత బలశాలి, ఆయన్ను ఎదుర్కోలేకపోతున్నావని నీలో స్పష్టంగా కనిపిస్తోంది.
– హామీలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉన్న వాడికి ఇబ్బంది కానీ…అధికారంలోకి రాను అనుకునే వాడు ఎన్నైనా వాగ్ధానాలు ఇస్తాడు.
– చంద్రబాబుకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకున్న చరిత్ర ఉన్నదా..?
– క్యాష్‌వార్‌ చంద్రబాబుకే అలవాటు. హైదరాబాద్‌లో డబ్బుతో ఓటును కొంటూ దొరికిపోయి పారిపోయి వచ్చినవాడు చంద్రబాబు.
– క్యాష్‌ తో రాజకీయాలు చేయాలనుకుంటాడు తప్ప తన శక్తితో రాజకీయాలు చేయాలనుకునే వ్యక్తి చంద్రబాబు కాదు.

LEAVE A RESPONSE