Suryaa.co.in

Telangana

ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒక మాట

– బీజేపీ పార్టీ అమ్మకంకు కేరాఫ్‌ 
– టీఆర్‌ఎస్ తెలంగాణలో ఒక నమ్మకం
– మంత్రి సబితాఇంద్రారెడ్డి
రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మహేశ్వరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మహేశ్వరం నియోజక వర్గ మండల కేంద్రంలో జడ్పీచైర్పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు తీగల క్రిష్ణారెడ్డితో కలిసి మహాదర్నాలో పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్య‌క్షులు అంగోతు రాజునాయక్ అధ్య‌క్షతన జరిగిన ధ‌ర్నాను ఉద్దేశించి మంత్రి మాట్లాడు తూ..డిల్లీలో ఒకమాట గల్లీలో ఒక మాటతో తెలంగాణ బీజేపీ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారని ఆమె అన్నారు.తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారిన నల్ల చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవాలని ఆమె అన్నారు.వరి వేస్తే ఉరి వేస్తామనే రీతిలో కేంద్రం ప్రవర్తిస్తుందని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అమ్మకంకు కేరాఫ్‌గా మారిందని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణలో ఒక నమ్మకంగా పనిచేస్తుందని అన్నారు.మోడీ ప్రభుత్వం వందలాది ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ లక్షలాది మంది ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తుందని అన్నారు.
కార్పొరేట్‌ సంస్థలకు దాసోహం అంటున్న మోడీ విధానాలను బారత దేశ ప్రజలందరూ ఖండిస్తున్నారని ఆమె అన్నారు.పంజాబ్‌ మాదిరిగా తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యం గింజను కొనాలని ఆమె డిమాండ్‌ చేసారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌,జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, మాజీ ఎస్సీ కమీషన్‌ సభ్యులు చిలకమర్తి నర్సింహ్మ, బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌ మేయర్లు చిగిరింత పారిజాత నర్సింహ్మరెడ్డి, దుర్గదీఫ్‌లాల్ చౌహన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, పహడీషరీఫ్‌,తుక్కుగూడ చైర్మన్‌లు మధుమోహన్‌, వైస్ చైర్మన్‌ పర్హానానాజ్‌పాల్గొన్నారు.

LEAVE A RESPONSE