Suryaa.co.in

Andhra Pradesh

బెంగ‌ళూరుకు మ‌కాం మార్చిన సాయి ప్రియ‌

-సోమ‌వారం సాయంత్రం అదృశ్య‌మైన సాయి ప్రియ‌
-బుధ‌వారం ఉద‌యం నెల్లూరులో ఉన్న‌ట్లు గుర్తింపు
-సాయంత్రానికే బెంగ‌ళూరులో ప్ర‌త్య‌క్ష‌మైన వైనం
-త‌న‌కోసం వెత‌కొద్దంటూ త‌ల్లిదండ్రుల‌కు సందేశం

వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా భ‌ర్త‌తో క‌లిసి విశాఖ బీచ్‌కు వెళ్లి భ‌ర్త క‌ళ్లుగ‌ప్పి ప్రియుడితో ప‌రారైన సాయి ప్రియ వ్య‌వ‌హారంలో బుధ‌వారం మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. సోమ‌వారం సాయంత్రం అదృశ్య‌మైన సాయి ప్రియ రెండు రోజుల త‌ర్వాత బుధ‌వారం నెల్లూరులో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్ర‌మంలో ఆమెను విశాఖ‌కు త‌ర‌లించేందుకు పోలీసులు య‌త్నిస్తున్న త‌రుణంలో సాయిప్రియ అక్క‌డి నుంచి చిన్న‌గా జారుకుంది.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో సాయి ప్రియ ఉన్న‌ట్లు స‌మాచారం. బెంగ‌ళూరు నుంచే ఆమె త‌న త‌ల్లిదండ్రుల‌కు వాట్సాప్ మెసేజ్ పంపింది. తాను క్షేమంగానే ఉన్నాన‌ని, త‌న కోసం వెత‌క‌వ‌ద్దంటూ స‌ద‌రు మెసేజ్‌లో ఆమె కోరింది. ఈ మెసేజ్‌ను సాయి ప్రియ త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు తెలియ‌జేశారు. నెల్లూరుకు చెందిన ర‌వి అనే యువ‌కుడితో కొంత కాలంగా ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతున్న సాయి ప్రియ‌… సోమ‌వారం సాయంత్రం భ‌ర్త క‌ళ్లుగ‌ప్పి అత‌డితో ప‌రారైన‌ట్లు పోలీసులు ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్‌ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.

శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్‌లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్‌ డే అని శ్రీనివాస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్‌ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్‌ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

గాలింపు కోసం రూ. కోటి ఖర్చు..

ఇదిలా ఉంటే సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ. కోటి ఖర్చు చేసింది. ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ.. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం…

LEAVE A RESPONSE