Home » శ్రీకాళహస్తి ఆలయంలో సాయికుమార్ పూజలు

శ్రీకాళహస్తి ఆలయంలో సాయికుమార్ పూజలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరో సాయికుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.

శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ అధికారులు సాయికుమార్ కుటుంబం సభ్యులను శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు వేద పండితులు వేదమంతురాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి,టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్,టెంపుల్ సూపర్డెంట్,సి.ఎస్.ఓ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply