Suryaa.co.in

Andhra Pradesh

సీఎం చిరునవ్వు నవ్వితే ఎవరికో మూడినట్లే: సాకే శైలజనాథ్

అనంతపురం: రాష్ట్రం అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చిరునవ్వు నవ్వితే ఎవరికో మూడినట్లే అని అన్నారు. చదువంటే స్కూల్ బిల్డింగ్‌లకు రంగులు వేయడం కాదని.. అక్షరం ముక్క రానివారిని సలహాదారులుగా పెట్టుకోవడం కాదన్నారు. సామాన్య ప్రజానీకం చదువు గురించి ఆలోచించాలని సూచించారు. ఫేక్, ఫ్రాడ్ ప్రభుత్వమని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని శైలజనాథ్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE