September 24, 2026

సజ్జనార్ తాట తీస్తాం

  • మేము అధికారం లోకి రావడం ఖాయం సజ్జనార్ ను ఎక్కడున్నా వదిలిపెట్టం
  • కేసీఆర్ పాటలు పెట్టడం పై నిషేధాలు విధించడానికి సజ్జనార్ ఎవరు ?
  • సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా ?
  • బ్రేక్ ఎపుడు చేయాలి? లంచ్ ఎపుడు చేయాలి అని కూడా సజ్జనార్ చెబుతారా ?
  • గణేష్ విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి నిమజ్జనం చేయడం బాధాకరం
  • కాంగ్రెస్ కు ఇక ఎందుకు ఓట్లేయాలి ?.. రక్తం మరుగుతోంది
  • రేవంత్ కు ఎలాగు సిగ్గు శరం లేదు ..రాహుల్ కు లేదా ?
  • రాహుల్ కు కూడా ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదే
  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దానం నాగేందర్ విషయం లో హైకోర్టు ,సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు అద్భుతం.
..పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కోసం మార్చి 24 2024 నుంచి బీ ఆర్ ఎస్ లీగల్ సెల్ పోరాడుతోంది. పిటిషన్ వేసిన నాడే దానం నాగేందర్ పై వేటు పడుతుందని చెప్పాం. కాంగ్రెస్ బీజేపీ లు కుమ్మక్కయ్యాయి.

చిల్లర గాళ్ళు , బ్రోకర్ గాళ్ళు, తీర్పు తర్వాత చేసిన వ్యాఖ్యలను కోర్టు సీరియస్ గా తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు మందికి పుట్టిన బిడ్డలు తమ బిడ్డలు అన్నట్టు గా మాట్లాడుతున్నారు. మిగతా ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయం లో బీజేపీ ఎందుకు పోరాడలేదు?

మార్చి 14 ,2024 నాడు దానం నాగేందర్ కాంగ్రెస్ కు అమ్ముడు పోయారు. మార్చి 18 ,2024 నాడు స్పీకర్ కు పిర్యాదు చేశాం. మార్చి 21 ,2024 దానం నాగేందర్ ను కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించింది. ఏప్రిల్ 10 ,2024 హై కోర్టు కు వెళ్ళాం. జూలై నుంచి మాటర్ హియరింగ్ మొదలైంది. జనవరి లో నేను ,మా కేటీఆర్ మళ్లీ కోర్టు కెళ్ళాం. జూలై ,2025 ,స్పీకర్ డెసిషన్ తీసుకోవాలని హై కోర్టు చెప్పింది. ఇంట్లో ఉంటారా జైల్లో ఉంటారా కూడా స్పీకర్ కు వార్నింగ్ ఇచ్చింది.

11 మార్చి 2026 న స్పీకర్ దానం కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. వెంటనే హై కోర్టు లో పిటిషన్ వేశాము. 18 సెప్టెంబర్ 2026 హై కోర్టు దానం నాగేందర్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే రోజు కేవియట్ వేశాము. ఈ రోజు సుప్రీం కోర్టు హై కోర్టు నిర్ణయాన్నే సమర్ధించింది. రెండున్నరేళ్ల మా పోరాటం తర్వాత దానం పై వేటు పడింది.

పోరాటం చేసింది బీ ఆర్ ఎస్సా ?బీజేపీ యా ? సిగ్గు లేకుండా ఇపుడు తమ ఘనత అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.
హైకోర్టు తీర్పు తర్వాత నాగేందర్ సుప్రీం కు పోనని చెప్పి మరుసటి రోజే మాట మార్చారు. కాంగ్రెస్ ఖైరతాబాద్ లో ఓడిపోతుందని తెలిసే సుప్రీం కోర్టు కు వెళ్లారు. రేవంత్ కు ఎలాగు సిగ్గు శరం లేదు. రాహుల్ కు లేదా ? రాహుల్ కు కూడా ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదే. పార్టీ మారిన మిగతా ఎనిమిది మంది పై కూడా వేటు తప్పదు. త్వరలోనే ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి.

ఖైరతాబాద్ లో 22 ఏ ప్రభావం ఉంటుంది. నిరుద్యోగులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేస్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇక జీవితం లో వార్డు మెంబర్లుగా కూడా గెలవరు. గణేష్ విగ్రహాల నిమజ్జననానికి కనీసం నీళ్లు వసతి కూడా ఇవ్వని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మా హుజురాబాద్ లో నిమజ్జనం కోసం నీళ్లు ఇవ్వాలని మంత్రి నుంచి సెక్రటరీ దాకా కోరాను ..అయినా స్పందన లేదు. గణేష్ విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి నిమజ్జనం చేయడం బాధాకరం. కాంగ్రెస్ కు ఇక ఎందుకు ఓట్లేయాలి ?రక్తం మరుగుతోంది.

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన నోరు అదుపులో పెట్టుకోవాలి. నిమజ్జనాల సందర్భంగా కేసీఆర్ పాటలు పెట్టడం పై నిషేధాలు విధించడానికి సజ్జనార్ ఎవరు ? సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా ? బ్రేక్ ఎపుడు చేయాలి లంచ్ ఎపుడు చేయాలి అని కూడా సజ్జనార్ చెబుతారా ? మేము అధికారం లోకి రావడం ఖాయం సజ్జనార్ ను ఎక్కడున్నా వదిలిపెట్టం.
సజ్జనార్ తాట తీస్తాం.

Total Visitors: 2,855,773