Suryaa.co.in

Andhra Pradesh

సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో, ఇప్పటివరకు రూ.1000కోట్లు దోచిపెట్టాడు

– అదే వెయ్యికోట్లతో దుల్హన్, రంజాన్ తోఫా, దుకాన్-మకాన్ పథకాలు ఎందుకివ్వడు?
– నాకు పేపర్, టీవీ లేదంటున్న జగన్ సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఎవరబ్బసొమ్మో చెప్పాలి – నష్టాల్లోఉన్నసాక్షి మీడియాకు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే కాసులపంట పండింది
– దేశానికే ఆదర్శంగా ఉండేలా ‘P-4’ తీసుకురావాలని ఆలోచిస్తున్నా
-వందేళ్ల స్వాతంత్ర దినోత్సవంజరుపుకునే నాటికి పేదవాళ్లను ధనికుల్ని చేయడమే ‘P-4’ కాన్సెప్ట్
– విజయవాడలో, కడపలో హజ్ హౌస్ లు నిర్మించి, అన్ని సౌకర్యాలు కల్పించింది టీడీపీ ప్రభుత్వమే
– ముస్లింలలోని పేదలకోసం దుకాన్-మకాన్ పథకం తీసుకొచ్చాము
– మీ ప్రాణానికి నాప్రాణం అడ్డేస్తా
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో మైనారిటీల ఆత్మీయసమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు ఇంకా ఏమన్నారంటే…

జగన్ నోటినుంచి నిజం రాదు. తన సైకో పాలనతో ఎందరో ముస్లింలను బలితీసుకున్న జగన్ రెడ్డి, వారి కుటుంబాల్ని పరామర్శించడానికి, ఎందుకు ఓదార్పు యాత్రచేయలేదు?, ముస్లింలకు అన్యాయంచేస్తూ, ప్రాణాలుతీస్తూ, వారికి మంత్రి పదవిచ్చానంటే సరిపోతుందా? వచ్చేఎన్నికల్లో మైనారిటీలు నిండుమనసుతో టీడీపీని ఆశీర్వదించాలి.

దుల్హన్ పథకానికి డబ్బులు లేవంటున్న ముఖ్యమంత్రి, తన అసాక్షి పత్రికకు మాత్రం ప్రకటనలరూపంలో, ఇప్పటివరకు రూ.1000కోట్లు దోచిపెట్టాడు. అదే వెయ్యికోట్లతో దుల్హన్, రంజాన్ తోఫా, దుకాన్-మకాన్ పథకాలు ఎందుకివ్వడు? “మైనారిటీలతో సమావేశమైందే వారి మనోభావాలు, సమస్యలు తెలుసుకోవడానికి. భవిష్యత్ లో వాటికోసం సరైన యాక్షన్ ప్లాన్ అమలుచేయాలన్నదే నాఆలోచన.దేశంలో మైనారిటీలను ఎక్కువగా మోసంచేసిన పార్టీ, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపార్టీ ప్రభుత్వాలే. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మైనారిటీలకు ఆ పార్టీ, టీడీపీప్రభుత్వా లు ఏంచేశాయో మైనారిటీ సోదర,సోదరీమణులు ఆలోచనచేయాలి.

మైనారిటీ కార్పొరేషన్ తీసుకొచ్చిందే స్వర్గీయ ఎన్టీఆర్ గారు.మైనారిటీ కమిషన్ తీసు కొచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అలానే ఉర్దూని రెండోభాషగా చేయాలని ఉమ్మడిరాష్ట్రంలో ముస్లింలు ఉద్యమాలుచేశారు. 2014లో నేను ముఖ్యమంత్రి అ య్యాక ఏపీలోని 13జిల్లాల్లో ఉర్దూని రెండో భాషగా ప్రకటించానని మీరు గుర్తుంచుకో వాలి. గతంలో హజ్ యాత్రకు వెళ్లాలంటే ముంబైమీదుగా వెళ్లేవారు. కానీ టీడీపీప్రభు త్వం హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టి, అక్కడినుంచే నేరుగా హజ్ యాత్రకు వెళ్లడా నికి ప్రత్యేక విమానసర్వీసులు నడిపించింది. టీడీపీ, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడే హైదరాబాద్ లో కేంద్రీయ ఉర్దూవిశ్వవిద్యాలయం ఏర్పాటుచేసింది. రాష్ట్రవిభజన తర్వాత విజయవాడలో, కడపలో హజ్ హౌస్ లు నిర్మించి, అన్ని సౌకర్యాలు కల్పించింది టీడీపీ ప్రభుత్వమే. కర్నూల్లో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసింది కూడా టీడీపీప్రభుత్వమే. ముస్లింలలోని పేదలకోసం దుకాన్-మకాన్ పథకం తీసుకొచ్చాము. మైనారిటీల ఆడపిల్లల పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారని ఎలాంటి నిబంధనలు లేకుండా దుల్హన్ పథకం కింద రూ.50వేలు అందించాను.

ముస్లిం వధూవరులు ఇద్దరూ 10వతరగతి చదవిఉండాలని, రాష్ట్రంలోనే నివసించాల ని అప్పుడే దుల్హన్ పథకం వర్తిస్తుందని జగన్ గుడ్డి నిబంధనలు తీసుకొచ్చాడు. మరి తనపక్కనుండే సలహాదారులకు ఎందుకని ఎలాంటి నిబంధనలు పెట్టడు? టీడీ పీ ప్రభుత్వం రాగానే ఎలాంటి నిబంధనలులేకుండా, గతంలో మాదిరే దుల్హన్ పథకం అమలుచేస్తుందని హామీ ఇస్తున్నా. టీడీపీప్రభుత్వం రాష్ట్రంలో 10లక్షలకుటుంబాలకు రంజాన్ తోఫా ఇచ్చింది. మరలా సంక్రాంతి పండుగకి సంక్రాంతికానుక ఇచ్చింది. పేదవాళ్లు అందరూ సంతోషంగా పండుగచేసుకోవాలనే ఆనాడు రెండుకానుకలు ఇచ్చాను. రంజాన్ సందర్భంలో దా నాలు చేసేవారు అల్లాకు దగ్గరవుతారని ప్రతీతి. అదికూడా విస్మరించి ఈ జగన్, రంజాన్ తోఫాను తొలగించాడు. దుల్హన్ పథకానికి డబ్బుల్లేవంటున్న ముఖ్యమంత్రి, తన అసాక్షి పత్రికకు మాత్రం ప్రక టనలరూపంలో 1000కోట్లు దోచిపెట్టాడు. నాకు పేపర్, టీవీ లేదంటున్న జగన్ సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఎవరబ్బసొమ్మో చెప్పాలి. ముఖ్యమంత్రి నోరుతెరిస్తే అబద్ధాలే. నష్టాల్లోఉన్నసాక్షి మీడియాకు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే కాసులపంట పండింది.

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలయ్యేలాచేసింది తెలుగుదేశంప్రభుత్వమే. ఊరికే రిజర్వేషన్లు అనిచెప్పి అమలుచేయకుండా గాలికివదిలేస్తే, దానిపై టీడీపీ ప్రభు త్వం హైకోర్ట్ లో, సుప్రీంకోర్టులో పోరాడింది. ఎంతడబ్బు ఖర్చైనా పరవాలేదు మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని చెప్పాను. మైనారిటీల మనోభావాలను టీడీపీ ప్రభుత్వం గౌరవించింది కాబట్టే 316దర్గాల మరమ్మతులకు ఆర్థికసహాయం అందించింది. 1385 మసీదుల నిర్మాణానికి, 43 ఖబరిస్తాన్ లు, 65 ఈద్గాలు, 164 ముస్లింప్రార్థనామందిరాల నిర్మాణానికి టీడీపీప్రభు త్వం నిధులిచ్చింది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఇవన్నీచేశాము.

ఇమామ్, మౌజన్ లకు దేశంలోనే తొలిసారి గౌరవవేతనం అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. ముస్లింయువతకు విదేశీవిద్య అమలుచేశాం. 567 మంది ముస్లిం యువతీయువకుల్ని ప్రపంచంలోని అన్నిదేశాలకు విద్యాభ్యాసంకోసం పంపిన ఘనత టీడీపీదే. టీడీపీప్రభుత్వం రాగానేమరలా ముస్లిం యువతకు విదేశీవిద్య అమలు చేస్తాం. ఉన్నత చదువులు చదువుకోవాలన్న మీ పిల్లల ఆశల్ని నిజంచేస్తాం. మసీదు స్థలాలకు పట్టాలులేవని, రూపాయిఖర్చులేకుండా వాటిని రిజి స్ట్రేషన్ చేయించాలని కోరారు. మీరుకోరిన దాన్ని మనప్రభుత్వం రాగానే అమలుచేస్తాం.

పేదరికంలో మగ్గిపోతున్న ముస్లింయువతకు, స్వయంఉపాధి కింద ఒక్కొక్కరికి రూ.3లక్షల రుణం అందించి, రూ.లక్ష సబ్సిడీ అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వా నిదే. అదికూడా జగన్ రాగానే రద్దుచేశాడు. ముస్లిం మైనారిటీలకు జగన్ రెడ్డి ఒక్కకార్యక్రమమైనా అమలుచేస్తున్నాడా అని ప్ర శ్నిస్తున్నా.
ఇక్కడి ఎమ్మెల్యే వంకర్రావు వ్యవహారశైలి చూశారా? మనబ్యానర్లు, ప్లెక్సీలు, కటౌట్లు తొలగిస్తాడా? ఇసుకదోపిడీలో వంకర్రావు మునిగితేలుతున్నాడు. మైనారిటీసోదరుల పై తప్పుడుకేసులు పెట్టిస్తున్నాడు. ప్రశ్నించిన కొమ్మాలపాటి శ్రీధర్ ను మీఇళ్లల్లో ఉన్నాడని అరెస్ట్ చేసి లాక్కెళ్లారు.

ముస్లిం మైనారిటీలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రానివ్వను. మీ ప్రాణానికి నాప్రాణం అడ్డేస్తానుతప్ప మీకు ఇబ్బంది రానివ్వను. కానీ సరైన సమయంలో మీరు సరైన ని ర్ణయం తీసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి ఏంచేస్తాడో ఎవరికీ అర్థంకాదు. పిచ్చితుగ్లక్ కంటే దారుణంగా తయారయ్యాడు. ముస్లింలకు అన్యాయంచేసి, వారిప్రాణాలు తీస్తూ, వారికి మంత్రి పదవిఇచ్చానంటే సరిపోతుందా? మీరే చెప్పండి? తెలుగుదేశం ప్రభు త్వం మైనారిటీలకు రాజ్యసభఇచ్చింది. తనకేసులమాఫీ కోసం దళారీలకోసం జగన్ రాజ్యసభ పదవి కట్టబెట్టాడు.

జీవోనెం-1ని సుప్రీంకోర్టు తప్పపట్టింది. న్యాయస్థానాలు లేకపోతే ఈ సైకో మనల్ని బతకనిచ్చేవాడుకాదు. తానే బాబాయ్ ని చంపి, ఆ నేరాన్ని నాపైకి నెట్టాలనిచూశా డు. సుప్రీంకోర్టు జోక్యంచేసుకోకపోతే వీళ్ల దుర్మార్గం ప్రజలకు తెలిసేది కాదు. బాబా య్ ని చంపిన వ్యవహారంలో తాను నిర్దోషినని అవినాశ్ రెడ్డిచెప్పడం విడ్డూరంగా ఉం ది. తండ్రినిచంపిన వారిని శిక్షించడానికి కూతురు పోరాడుతుంటే, ఆమెను వేధిస్తు న్నారు. జగన్ కు తనమన అనే తేడా లేదు.

జగన్ ప్రభుత్వంలో మైనారిటీలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. నరసరావు పేట లో షేక్ ఇబ్రహీంను దారుణంగా చంపారు. మైనారిటీల స్థలాన్ని ఆక్రమించడంపై ప్ర శ్నించడమే ఆయనచేసిన నేరం. రహమత్ అలీని తీవ్రంగా గాయపరిచారు. పలమ నేరు ప్రభుత్వపాఠశాలలో బాగా చదువుతున్న చిన్నారి మిస్బాను బలితీసుకున్నా రు. స్థానిక వైసీపీనేత సునీల్ తనకూతురు చదువులో ముందుండాలని, ప్రిన్సిపాల్ తో కలిసి మిస్బాను వేధించడంతో, తాను ఆత్మహత్యచేసుకుంది.

నంద్యాలలో అబ్దుల్ సలాం..రాజమహేంద్రవరంలో అబ్దుల్ సత్తార్ ల కుటుంబాల్ని బలి తీసుకుంది ఎవరు? రాయచోటిలో అంగన్ వాడీ టీచర్ అయిన నజీరాపై దేశద్రోహం కేసుపెట్టారు. తల్లిని, బిడ్డను కాపాడుకోవడానికి తనకు అంగన్ వాడీ ఉద్యోగమే దిక్కని చెప్పినా వినకుండా ఆమెను వేధించారు. జగన్ రెడ్డి ఓదార్పు యా త్ర ఏమైంది. ఎంతోమంది మైనారిటీలు ప్రాణాలుకోల్పోతే, ఒక్క కుటుంబాన్ని అయినా పరామర్శించాడా? మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరులోని 100 ముస్లిం కుటుంబా లు ఊరువిడిచి రావడానికి అక్కడి ఎమ్మెల్యేనే కారణం. గురజాల నియోజకవర్గంలో ముస్లిం బాలికపై వైసీపీఎమ్మెల్యే అనుచరులు అత్యాచారంచేస్తే ఎవరిపైనా ఎలాంటి చర్యలులేవు. పెదకూరపాడులో రంజాన్ మాసంలో ముస్లింలఇళ్లలో పోలీసులు చొరబ డటం ఏమిటి? మాజీఎమ్మెల్యే శ్రీధర్ ఏమైనా టెర్రరిస్టా.. డెకాయిట్టా? ఆయన్ని వెతికే నెపంతో మీ ఇళ్లల్లోకి పోలీసుల్ని పంపడం సైకోపాలన కాక ఏమిటి?

గతంలో హైదరబాద్ లో 6నెలలు కర్ఫ్యూ ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకే హైదరాబాద్ లో మతకలహాలు కట్టడిచేసింది. పాతబస్తీని బ్రహ్మండంగా అభివృద్ధిచే సింది. ముస్లింలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపింది టీడీపీ నే. పెదకూరపాడు చుట్టుపక్కల ఆటోమొబైల్ పరిశ్రమపై ఆధారపడి బతికేవారు ఎ క్కువ ఉన్నారని చెప్పారు. ఆటోమొబైల్ పరిశ్రమపై ఆధారపడిన మెకానిక్ లకు కూడా ఐటీఉద్యోగుల మాదిరి ఎక్కువఆదాయం, మంచి భవిష్యత్ ఉండేలా చర్యలు తీసుకుంటాము. అరబిక్ పాఠశాలని, గుంటూరుజిల్లాలో ఉర్దూయూనివర్శిటీ బ్రాంచ్ ను ఏర్పాటుచేస్తాము. ఈ నియోజకవర్గంలో ఆటోనగర్ అవసరముంది. దాన్నికూడా పెట్టిస్తాం. మానవవనరుల అభివృద్ధి, సాంకేతికతతో ఏదైనా సాధించవచ్చని నిరూపిం చినవాడిని.

ముస్లింల ప్రార్థనామందిరాలపై దాడులకు సంబంధించి అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. నేను ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు ముస్లింలపై దాడులు జరిగాయా? ఈ దుర్మార్గుడు రాబట్టే మీకు ఇన్నికష్టాలు. అవసరమైతే ముస్లింలకు కూడా సబ్ ప్లా న్ తీసుకొస్తాం. మీరు చెప్పినవి నేను చేస్తాను..నేను చెప్పింది మీరు ప్రజలకు చెప్పండి, మీవాళ్లకు చెప్పండి. రేపు జరిగేఎన్నికలలో మైనారిటీ సోదరులు టీడీపీని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతున్నాను.

దేశానికే ఆదర్శంగా ఉండేలా ‘P-4’ తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. పేదప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, ప్రజలభాగస్వామ్యంతో పేదరికాన్ని రూపుమాపడమే P-4. 2047 నాటికి, మనదేశం వందేళ్ల స్వాతంత్ర దినోత్సవంజరుపుకునే నాటికి పేదవాళ్లను ధనికుల్ని చేయడమే ‘P-4’ కాన్సెప్ట్. ”

LEAVE A RESPONSE