Suryaa.co.in

Entertainment Telangana

క్రైస్తవం వీడి హిందువుగా సమంత

హైదరాబాద్‌: క్రైస్తవం వీడి హిందువుగా సమంత మారింది. సౌత్ ఇండియన్ తెలుగు హీరోయిన్ సమంత స్వామి జగ్గీ వాసుదేవ్ జీ సమక్షంలో క్రైస్తవమతాన్ని వీడి హిందువుగా మారింది. కోట్ల రూపాయలున్నా, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నా సమంత ఆరోగ్య సమస్యకు స్వామి జగ్గీ వాసుదేవ్‌… లక్ష ‘ఓంకార’ మంత్ర జపంతో నయం చేసి ఉపశమనం పొందేలా మార్గదర్శనం చేశారు. దీంతో ఆమె జగ్గీవాసుదేవ్ వద్ద క్రైస్తవం వీడి హిందూ ధర్మం స్వీకరించింది. తాను పుట్టింది క్రిస్టియానిటీలో కానీ తానూ పోయేది హిందూధర్మంలో అని తానూ చెప్పడం విశేషం. ఎందుకు వదిలారు అని ప్రశ్నిస్తే… ధర్మానుసారం ఎన్నో ‘ప్రశ్నలకు’ సమాధానం హిందూ ధర్మంలో దొరికాయని ఆవిడ తెలపడం కొసమెరుపు.

LEAVE A RESPONSE