కోరంగి : సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరోసారి నిరూపించింది. కోరంగిలో గల బిసి బాలికల వసతి గృహంలో విద్యార్థుల అవసరాన్ని గుర్తించి, 10 ఫ్యాన్లు, 10 ట్యూబ్ లైట్లు అందజేసింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్చార్జీ మేకా లక్ష్మణమూర్తి, విశిష్ట అతిథిగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పాల్గొన్నారు. వార్డెన్ అనురాధకు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అందజేశారు.
వసతి గృహ విద్యార్థులు మాట్లాడుతూ— “సరిగ్గా ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు లేక ఇబ్బందులుఎదుర్కొంటున్నాం వార్డెన్ అనురాధ ఈ విషయాన్ని ఎంపీ సానా సతీష్ బాబు దృష్టికి తీసుకెళ్లగా అయన వెంటనే స్పందించి సహాయం అందించారు. దీనికి మా ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు.
ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ — “వసతి గృహంలో విద్యార్థులకు ఇతర సమస్యలు ఉన్నా అవి కూడా ఎంపీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఎంపీ పీఏ గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.