– అవినీతి రాజ్యమేలుతోంది
– రోడ్లపై గుంతలు పూడ్చే దిక్కులేదు
– జగన్ సర్కారును సాగనంపేవరకూ పోరాటం
– మోదీ పథకాలపై ఇంటింటికీ ప్రచారం చేయాలి
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి
గుంటూరు: ఏపీలో ఇసుక, మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందీశ్వరి ఆరోపించారు. రోడ్లపై గుంతలు పూడ్చే దిక్కులేని జగన్ సర్కారు, మూడు ప్రభుత్వాల పేరిట ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన నిధులు సద్వినియోగం చేసుకోలేని జగన్ ప్రభుత్వం, వాటిని ఇతర మార్గాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడేందుకు కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలన్నారు. ప్రధాని మోదీ వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.
తుళ్లూరు మండలంలోని నెక్కల్లు గ్రామంలో పిరమిడ్ కళ్యాణ మండపము నందు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యకతన జరిగిన గుంటూరు జిల్లా భారతీయ జనతాపార్టీ కార్యవర్గ సమావేశంలో పురందీశ్వరి ప్రసంగించారు. కార్యవర్గ సమావేశం అనంతరం మీడియా తో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ..బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి ఏవిధముగా కృషి చేయాలి అనేది నాయకులతో కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించాం.పార్టీని బూత్ లెవెల్ నుండి నియోజకవర్గ లెవెల్ వరకు పార్టీని ఎలా బలోపేతం చేయాలో దిశానిర్దేశం చేసాం.
ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కనపడట్లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఈ ప్రభుత్వం ఏ విధమైన పనులు చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న నిధులను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. అభివృద్ధి ఎటు చూసినా కనపడటం లేదు. రాష్ట్రంలోని రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయంగా మారిపోయాయి. వీటిని బాగు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్క బెడుతుంది.
పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల 30 లక్షల ఇళ్లను నిర్మాణానికి మంజూరు చేస్తే, ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే, ఇంతవరకు నిర్మాణానికి కూడా నోచుకోక పోవటం చాలా విచారకరం. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 1,80,000 కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా చేస్తూ అవినీతికి పాల్పడుతుంది. రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి పెట్టుబడులు రాక, తీసుకు రాలేకపోవటం రాష్ట్ర ప్రజలను మోసం చేసే కుట్రలో భాగమే ఈ ప్రభుత్వం నిదర్శనం. అమరావతి రాజధాని నిర్మాణానికి భారతీయ జనతాపార్టీ కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి ఒక రాజధాని కట్టుబడకుండా మూడు రాజధానులు అంశం పదే పదే ప్రస్తావించటం, రాష్ట్ర ప్రజలను మోసం చేయటమే దీనిని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో బిజెపి రాష్ట్ర ప్రజల అందరి మన్ననలను పొందే విధంగా ముందుకు వెళుతుందని తెలిపారు.
జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూపూడి రంగరాజు, అమ్మిశెట్టి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ధారా సాంబయ్య, లోకసభ సంయోజక్ భీమినేని చంద్రశేఖర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశ్వంత్, జిల్లా ప్రధాన కార్యదర్సులు చరక కుమార్ గౌడ్, R. భాస్కర్, అప్పిశెట్టి రంగా, పాలపాటి రవికుమార్, వెలగలేటి గంగాధర్, రాష్ట్ర IT సెల్ కన్వీనర్ మకుటం శివ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, వివిధ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్సులు, జిల్లా కార్య వర్గ సభ్యులు, మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్సులు, మోర్చా రాష్ట్ర పదాధికారులు, మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,వివిధ సెల్ కన్వీనర్ లు మరియు తుళ్లూరు మండలం అధ్యక్షులు నీరుకొండ లక్ష్మీనారాయణ,జిల్లా కార్యవర్గ సభ్యులు నరేంద్ర పాల్గొన్నారు.