– నీళ్లుంటే ఇసుక తవ్వకాలకు ఆటంకమని రాత్రికి రాత్రి జిలెటిన్ స్టిక్స్‌తో డ్యామ్‌ను కూల్చారు
– దీని వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం
– రేవంత్ రెడ్డి పాలనలో చెరువులు, చెక్ డ్యామ్‌ల విధ్వంసం నిత్యకృత్యంగా మారింది
– కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం వెనుక జిలెటిన్ స్టిక్స్ కుట్ర
– డ్యామ్ పేలిపోవడానికి కారణం నాణ్యతా లోపమైతే, నిర్మించిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ను బ్లాక్ లిస్ట్ చేయాలి
– రాష్ట్రంలో వారికి ఇచ్చిన అన్ని టెండర్లను రద్దు చేయాలి
– చెక్ డ్యామ్‌ల పేల్చివేత ఘటనపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తాము
– జమ్మికుంట మండలం, తనుగుల గ్రామంలోని మానేరు వాగులో చెక్ డ్యామ్ పేల్చిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు
జమ్మికుంట, ఓదెల మండలాల మధ్య మానేరు నదిపై నిర్మించినటువంటి 24 కోట్ల రూపాయల చెక్ డ్యామును ఇసుక మాఫియా ఆధ్వర్యంలో పేల్చారు. చెరువుల పేల్చివేత, చెక్ డ్యామ్ ల పేల్చివేత నిత్యకృత్యంగా మారింది కాంగ్రెస్ పాలనలో. గతంలో హుస్సేన్ మియా వాగుపై చెక్ డ్యాం ను పేల్చే ప్రయత్నం చేశారు. నిర్మల్ లో స్వర్ణ వాగుపై ఉన్న చెక్ డ్యాం ని పేల్చేశారు. ఈరోజు మానేరు నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యామును పేల్చి వేశారు. ఇక్కడ ఓదెల మండల రైతులు జమ్మికుంట మండల రైతులు వచ్చి ఈ విషయాన్ని మాకు చెబుతున్నారు. రాత్రి 8 గంటల వరకు చేపలు పట్టాము.
ఉదయం 6 గంటలకు చెక్ డాం పేల్చి నీళ్లు కిందకు వదిలారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ నాయకులే ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. నీళ్లుంటే ఇసుక తవ్వకాలు జరపలేమని రాత్రికి రాత్రి చెక్ డాంని పేల్చి కుట్ర చేశారు. హుస్సేన్ మియా వాగుపై చెక్ డాంను పేల్చే క్రమంలో రైతులే ఆ దుండగులను పట్టుకున్నారు. పేలుడు పదార్థాలతో సహా నిందితులను పోలీసులకు రైతులు పట్టించారు. అయినా వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. ఎందుకంటే వారు కాంగ్రెస్ నాయకులు. వారిని కాపాడుతున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది స్పష్టంగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్ర.భోజన్నపేట, కొత్తపేటలోని రైతులతో పాటు వందల మంది రైతులు సంతకాలు పెట్టి హుస్సేన్ మియా వాగు మీద కట్టను పేల్చేందుకు చూశారని ఫిర్యాదు చేశారు.
ఆరోజు హుస్సేన్ మియా వాగుపై కట్టను పేల్చేందుకు ప్రయత్నం చేసినా తమపై కేసు కాలేదనే ధైర్యంతో ఈ కట్టను పేల్చారు. ఇరిగేషన్ ఇంజనీర్లు బాంబ్ బ్లాస్ జరిగింది గిలెటిన్లు పెట్టి పేల్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు కనీస చర్యలు లేవు. హైదరాబాదులో పేదల ఇల్లులను కూలుస్తారు, ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డాములు కూల్చేస్తారు. కూల్చడం తప్ప కట్టడం మీకు చేతకాదు రేవంత్ రెడ్డి. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో చెక్ డాంలను కాంగ్రెస్ నాయకులు, ఇసుక మాఫియా కూలుస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 1200 చెక్ డాములు నిర్మించింది. 44వేల చెరువుల పునర్ధరణను కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ప్రతి వాగు మీద, వంక మీద చెక్కు డ్యామ్ ను బట్టి ప్రతీ నీటి చుక్కను ఒడిసిపట్టి రైతులకు నీళ్లను అందించింది కేసీఆర్ ప్రభుత్వం.
ఇసుక తవ్వకాలకు డ్యాంలు అడ్డం వస్తున్నాయని పేల్చేస్తారా? ఇది దుండగుల పేలుడులో కూలి ఉంటే వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేదా.. కాంట్రాక్టర్ సరిగ్గా నిర్మాణం చేయలేదా? ఈ కట్టను నిర్మించిన రాఘవ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయండి. రాష్ట్రంలో చేస్తున్న అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరానికి ఆరు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? ఒక చెక్ డాం కట్టారా? ఒక చెరువు కట్టారా? కట్టిందేమీ లేదు విధ్వంసం తప్ప. ఎన్ డి ఎస్ సి అని, విజిలెన్స్ కమిషన్ అని, గోస్ కమిషన్ అని కాళేశ్వరంపై విషం చిమ్ముతున్నారు. రెండేళ్లు అయినా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎందుకు మరమ్మత్తు చేయడం లేదు.
యాదాద్రి, సిద్దిపేట, మెదక్, కరీంనగర్, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో కొద్దిపాటి ఖర్చుతో పిల్ల కాలువలు తవ్వితే లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయి.. కేసీఆర్ కి పేరొస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారని కాళేశ్వరాన్ని పడావు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ లో 25 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కొండపోచమ్మలో పది టి.ఎం.సి ల నీళ్లు ఉన్నాయి. అన్నపూర్ణలో మూడున్నర టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రంగనాయక సాగర్‌లో మూడు టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కొంత ఖర్చుతోనే కాలువలు తవ్వితే లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. కేసీఆర్ మీద కోపంతో రాష్ట్ర రైతుల కడుపు కొడుతున్నారు. మంచిగా వర్షాలు పడితే ఎస్సారెస్పీ నుండే మిడ్ మానేరుకు కాళేశ్వరం మోటర్లు ఆన్ చేస్తాం. మధ్యస్థంగా వర్షాలు పడితే ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు ఎల్లంపల్లి మోటార్ ఆన్ చేస్తాం.
ఎక్కడా వర్షం లేకపోతే మేడిగడ్డ దగ్గర మోటర్లు నడుస్తాయి. కాళేశ్వరంలో మల్లన్న సాగర్ భాగం కాదా? మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకెళ్తున్నది నిజం కాదా? బ్లాస్టింగ్లు, జిలెటిన్లు చూస్తుంటే మేడిగడ్డ దగ్గర కూడా జిలెటీన్లు పెట్టి బ్లాస్టు చేశారేమో అనే అనుమానాలు వస్తున్నాయి. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్ స్టేషన్లు, రెండు వందల కిలోమీటర్ల టన్నెలు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్. ఒక మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నది.
మేడిగడ్డ వద్ద కూడా జిలెటిన్స్ పెట్టి పేల్చినట్టు ఇంజనీర్లు కంప్లైంట్ ఇచ్చారు. పెద్దపల్లిలో జిలెటిన్ స్టిక్స్ తో కాంగ్రెస్ నాయకులు దొరికారు. మీకు కమిషన్లు ముఖ్యం. ఇసుక మాఫియా నడిపే కాంగ్రెస్ నాయకులు ముఖ్యం. వాటాల కోసం తప్ప రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించడం లేదు. యుద్ధాలు జరిగినప్పుడు కూడా సాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోరు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు టెర్రరిస్టులను మించిపోయారు. అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. చెక్ డాంలు పేల్చివేతపై బీఆర్ఎస్ పోరాటం చేస్తది.

