– తాహసీల్దార్ వార్నింగ్ .. వార్నింగే
– ఎస్ ఐ కు భయపడం
– ఇదీ మోపిదేవీ శాండ్ మాఫియా తీరు తెన్నూ
– కలెక్టర్ బాలాజీని అలెర్ట్ చేయండి
– అవనిగడ్డ నియోజకవర్గంలో ఇసుకాసుర స్వైర విహారం
(బహదూర్)
గాంధేయ వాది.. హింసకు అతిదూరం. ప్రశాంతతే ఆయన నైజం. కానీ.. ఆయన ఇలాఖాలో అదే అవనిగడ్డ నియోజకవర్గంలో .. ఇసుకాసుర స్వైర విహారం అనితరం. అనన్యసామాన్యం. ఒక వైపు ఇలాంటి పనులు వద్దని ఆ నేత మొత్తుకున్నా.. ఇసుక రక్కసులు బేఖాతరు చేస్తున్నారు. ఇక రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరించినా.. అసలు తగ్గేదే లేదంటూ ఇసుక తవ్వేస్తున్నారు. మరీ ముఖ్యంగా మోపిదేవి మండలంలో శాండ్ మాఫియా చెలరేగిపోతోంది. కృష్ణానదిలో ఇసుకను తోడేసి పడవల్లో తరలిస్తోంది. వందల కొద్దీ ట్రాక్టర్లను రంగంలోకి దించి నోట్ల కుంభవృష్టిలో చిందులేస్తోంది.