హైదరాబాద్: లింగాయత్, ఆరే మరాఠాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ ఓబీసీ కమీషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం ఆహిర్ ను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప విజ్ఞప్తి చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షం లో ఎన్ బీ సీ చైర్మన్ కు వినతిపత్రం అందించారు.
హైదరాబాద్ కు వచ్చిన చైర్ మన్ తో ఈ విషయం పై బండి సంజయ్ ప్రత్యేకంగా చర్చించి వీరశైవ లింగాయత్ కుల పెద్దలను భేటీ చేయించారు. వీరశైవ లింగాయత్ లు సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారని, జాతీయ ఓబిసి జాబితాలో లేకపోవడం వల్ల విద్యా, ఉద్యోగాల్లో బాగా నష్టపోతున్నారని వివరించారు.వీరశైవ లింగాయత్, ఆరె మరాఠా తో పాటు పలు కులాలను జాతీయ ఓబిసి జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తామని హన్స్ రాజ్ గారు హామీ ఇచ్చారు.
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కు లింగాయత్ లు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా హన్సరాజ్ గారు వచ్చిన తర్వాత జాతీయ ఓబీసీ జాబితా లో చేరికల ప్రక్రియ వేగ వంతం అయిందని, త్వరలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం లింగాయత్ లను, ఆరే మరాఠాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చుతారన్న విశ్వాసం తమకుందని సంగప్ప చెప్పారు. ఈ సమావేశంలో వీరశైవ లింగాయత్ సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ముస్తాపురే, సంకటాల సోమేశ్వర్, బర్మాని మల్లికార్జున్, చంద్రశేఖర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
బీరప్ప కళ్యాణం లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
నారాయణఖేడ్ మండలం రుద్రారం లో జరిగిన బీరప్ప కళ్యాణం లో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప పాల్గొన్నారు. బీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభ లో మాట్లాడుతూ సమాజంలో గొల్ల, కురుమలది ఒక ప్రత్యేక స్థానమని అన్నారు. గొల్ల కురుమలకురైతులకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుందని, ఒక రైతుబిడ్డగా అది తనకు తెలుసు సంగప్ప అన్నారు. ఈ రోజుల్లో రసాయన ఎరువులు వచ్చాయి కానీ, ఒకప్పుడు తమ వ్యవసాయ భూములు సారవంతం చేసుకునేందుకు గొల్ల, కురుమలతో మాట్లాడి వాళ్ళ మేకలు, గొర్రెలకు తమ చేన్లలో విడిది ఇచ్చే వాళ్ళని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సంజు పాటిల్, ఏక్నాథ్, సంజు యాదవ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.