చాకలి అయిలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తి
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప
ధీర వనిత చాకలి అయిలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తి అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నారాయణఖేడ్‌లో విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆనాడు చాకలి ఐలమ్మ నిజాం తాబేదారులతో పోరాడి తన భూమిని దక్కించుకున్నరని సంగప్ప వివరించారు. నాడు అయిలమ్మ నిజాం పై పోరాడితే నేడు సీఎం కెసిఆర్ నిజాం సమాధికి మొక్కి ఆమె పోరాటాన్ని ఆమె పోరాటాన్ని కించపరిచారని సంగప్ప విమర్శించారు.
కేసీఆర్ బీసీ కులాల ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. వేరే మతస్థుల దిభీ ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ స్కీమ్ ను అమలు చేయడం ద్వారా రజకులు రోడ్డున పడుతారని సంగప్ప అన్నారు. ప్రధాని మోడీ గారు రజకులకు విశ్వకర్మ పథకాన్ని అమలు చేసి వారి ఉపాధిని పెంచుతుంటే, కేసీఆర్ రజకుల పొట్ట కొడుతున్నారని ఆయన ఆరోపించారు.సంగప్ప వెంట బిజెపి నేతలు రజినీకాంత్, సాయిరాం, పట్నం మాణిక్, సంజు పాటిల్, రాజు గౌడ్, సోదరులు నమ్లిమెట్ శివ, సతీశ్, సజు యాదవ్ తదితరులు ఉన్నారు.