– రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసమే కేసీఆర్ పై సంజయ్ ఆరోపణలు
– ఆ తలమాసిన అధికారి పేరును దమ్ముంటే సంజయ్ బయట పెట్టాలి
– సంజయ్ ను నరేంద్ర మోడీ తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్
– కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు
హైదరాబాద్: కేంద్రమంత్రి సంజయ్ గత ఎన్నికల్లో తనను గెలిపించిన సీఎం రేవంత్‌రెడ్డి కళ్లలో మెరుపుల కోసమే, తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసూజు శ్రవణ్ మండిపడ్డారు. ఎవడో తలమాసిన అధికారి పేరు అడ్డుపెట్టుకుని ఆరోపణలు చేస్తున్న సంజయ్‌కు దమ్ముంటే , ఆ అధికారి పేరు చెప్పాలని సవాల్ చేశారు. కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ, దాసోజు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దాసోజు ఇంకా ఏమన్నారంటే.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అత్యంత నీచమైన ,సభ్య సమాజం హర్షించని ఆరోపణలు చేశారు. బండి సంజయ్ తాను కేంద్ర మంత్రినని మరచి కార్పొరేటర్ కన్నా హీనంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసమే సంజయ్ కేసీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
బీదర్ లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ నడిపారని, ఎవరో పోలీసు అధికారి తనకు చెప్పారని సంజయ్ అన్నారు .ఆ తలమాసిన అధికారి పేరును దమ్ముంటే సంజయ్ బయట పెట్టాలి. ఏడు సార్లు ఎమ్మెల్యే ,మూడు సార్లు ఎంపీ గా పదేళ్ల పాటు సీఎం గా పని చేసిన కేసీఆర్ పై.. భాద్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ ఆరోపణలు చేయొచ్చా ? నేరం గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వకపోతే ఆరోపణ చేసిన వారి తప్పవుతుంది.
కేవలం సంచలనాల కోసమే తప్పుడు ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై, పోలీసులు తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. బండి సంజయ్ లాంటి వ్యక్తి మంత్రిగా కొనసాగడం కేంద్ర ప్రభుత్వానికే అవమానకరం. బండి సంజయ్ ను నరేంద్ర మోడీ తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి.
కరీంనగర్ నుంచి ఎంపీ గా గెలిచేందుకు సహకరించిన రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకు బండి సంజయ్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి ఫార్మా ,ఐటీ కంపెనీల నుంచి ఆయన చేసిన వసూళ్ల దందానే కారణం. బండి సంజయ్ తన ఆరోపణల పై ఎన్ ఐ ఏ ,ఈడీ ,సిబిఐ లకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం .బండి సంజయ్ పిచ్చి ఆరోపణల పై తగిన విధంగా బదులిస్తుంది.