Suryaa.co.in

Andhra Pradesh

సంజయ్ పై సస్పెన్షన్ వేటు

– హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు

అమరావతి: జగన్ జమానాలో సీఐడీ చీఫ్‌గా ఉంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి, జగన్ కళ్లలో ఆనందం చూసిన నాటి సీఐడీ చీఫ్ సంజయ్‌పై కూటమి సర్కారు ఎట్టకేలకూ సస్పెన్షన్ వేటు వేసింది.

సంజయ్ ఇంతకుముదు ఫైర్ డిపార్ట్ మెంట్ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో కోటి మేర దుర్వినియోగం జరిగిందన్న విషయాన్ని విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. పనులు పెద్దగా జరగకుండానే భారీ మొత్తంలో చెల్లింపులు చేసినట్టు, సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్ దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారణ అయింది.

దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సంజయ్ పై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. దళితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి.

LEAVE A RESPONSE