Suryaa.co.in

Telangana

సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్

– ఆదివాసీ గ్రామాల్లో అన్ని సౌకర్యాల కోసం కార్యాచరణ
– బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం.గత సంవత్సరం ఢిల్లీలో భారత ప్రభుత్వం తరుఫున ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ పెద్ద సంస్కరణవాది. అన్ని రకాల సామాజిక ఉద్యమాలకు, సామాజిక మార్పుకు బ్రిటీష్ కాలంలో కేంద్ర బిందువుగా పని చేసారు.

మద్యపాన నిషేదానికి, మద్యం సేవించకూడదని, బాల్యవివాహాలను అరికట్టడానికి పోరాటం చేశారు. హిందువులను బలవంతంగా మతమార్పిడి చేయాలని బ్రిటీష్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తే సంత్ సేవాలాల్ గారు వారికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి ఉద్యమం చేశారు. సమాజంలోని వివిధ వర్గాలు, కులాలలో సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్.

సేవాలాల్ ఆరోజు తీసుకొచ్చిన సంస్కరణలు ఈనాటి సమాజం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ గిరిజిన మోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సంత్ సేవాలాల్ మహారాజ్ గారు మన తెలుగు రాష్ట్రంలోనే జన్మించారు. ఇక్కడ నుండే సంత్ మహారాజ్ గా మారి ఉద్యమానికి నిర్మూలం చేశారు.

మహారాజ్ గారి స్ఫూర్తితో రానున్న రోజుల్లో బంజారా సమాజం హక్కులు, ఆర్థిక స్వావలంబన, బలోపేతం కోసం ఆదివాసీ గ్రామాల్లో మొదటి దఫా అన్ని రకాల సౌకర్యాల కోసం కార్యాచరణ రూపొందించాం. భారత ప్రభుత్వం తరుఫున, నరేంద్ర మోదీ నేతృత్వంలో బంజారా సమాజం కోసం సమగ్రమైన అభివృధ్ధి జరగడానికి కృషి చేస్తాం.

LEAVE A RESPONSE