సాక్ష్యాధారాలు ఉన్నాయని,ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి
ప్రకాశంజిల్లా కొమరోలు మండలం సర్వ సభ సమావేశంలో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మండలంలోని విద్యాశాఖ అధికారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ,కొమరోలు సర్పంచ్
దండు శశికళ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా కొమరోలు సర్పంచ్ దండు శశికళ మాట్లాడుతూ.. మండల విద్యాశాఖ అధికారి అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని,సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
ఈ సందర్భంగా మండల ఎంపిపి కామూరి అమూల్య మాట్లాడుతూ..మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలు వెల్లడించాలని, సర్పంచ్ దండు శశికళకు విజ్ఞప్తి చేశారు.సంబంధిత అధికారిపై చర్యలు తీసుకునేలా చూస్తామని అన్నారు.ఇదిలా ఉంటే సంబంధిత విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ వ్యక్తిగత కక్షలతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. మొత్తానికి సర్వ సభ సమావేశంలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో మండలంలో నెలకొన్న సర్వ సభ సమావేశం పరిస్థితులపై ఆసక్తి నెలకొంది.